అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికేత్తేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికేత్తేశారు. మోదీ(Modi) తనకు మంచి మిత్రుడని, మంచి మనిషి అంటూ రిపబ్లికన్‌ పార్టీ(Republican Party) అభ్యర్థి అయిన ట్రంప్‌(Trump) తెగ పొగిడేశారు. ఫ్రాగ్రాంట్‌ పోడ్‌కాస్ట్‌లో భాగంగా ప్రపంచ నేతల గురించి మాట్లాడిన ట్రంప్‌ మన ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ ప్రధానమంత్రి అవ్వడానికి ముందు భారతదేశం అస్థిరంగా ఉండేదని, ఆయన ప్రధాన పదవి చేపట్టిన తర్వాతే స్థిరత్వం వచ్చిందని అన్నారు. దేశానికి ఆయన ఓ తండ్రిలాంటి వారని కితాబిచ్చారు. 2019 సెప్టెంబరులో అమెరికాలోని టెక్సాస్‌ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’ (Howdy Modi) కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి విశేష స్పందన లభించిదని, దాదాపు 80 వేలమంది వచ్చారని, ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం జరిగిందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతలకు సంబంధించి మోదీతో జరిపిన సంభాషణను కూడా ట్రంప్‌ ప్రస్తావించారు. కొన్ని సందర్భాలలో భారత్‌ను బెదిరించడానికి పాకిస్తాన్‌ ప్రయత్నించిందని చెబుతూ ఇలాంటి వ్యవహారాలను చక్కదిద్దడంలో తాను ఆరితేరానని, కావాలంటే సాయం చేస్తానని మోదీతో అన్నానని ట్రంప్‌ చెప్పారు. దానికి మోదీ చాలా దూకుడుగా స్పందించారన్నారు. 'ఈ విషయాన్ని నేను చూసుకోగలను. అవసరమైతే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే ఎన్నోసార్లు వారిని ఓడించాం' అని మోదీ బదులిచ్చారు. ఆ జవాబు విన్న తాను ఆశ్చర్యానికి గురయ్యానని ట్రంప్‌ పేర్కొన్నారు.

ehatv

ehatv

Next Story