Swan Stop Train : పావుగంట పాటు ట్రైన్‌ను అడ్డుకున్న హంస!
బ్రిటన్‌లో(Britain) ఓ రైలు పావుగంట పాటు ఆగిపోయింది. రైళ్లన్నాక ఆగుతుంటాయి..ఇదేం పెద్ద వార్తా అని అనుకుంటున్నారా? ఆ రైలును ఆపింది ఓ బాతు(Swan) కాబట్టే వార్తయ్యింది. లండన్లోని బిషప్ స్టార్ట్‌ఫోర్డ్ స్టేషన్‌లో బాతులాంటి(duck) హంస ఒకటి రైలును అడ్డుకుంది.
బ్రిటన్‌లో(Britain) ఓ రైలు పావుగంట పాటు ఆగిపోయింది. రైళ్లన్నాక ఆగుతుంటాయి..ఇదేం పెద్ద వార్తా అని అనుకుంటున్నారా? ఆ రైలును ఆపింది ఓ బాతు(Swan) కాబట్టే వార్తయ్యింది. లండన్లోని బిషప్ స్టార్ట్‌ఫోర్డ్ స్టేషన్‌లో బాతులాంటి(duck) హంస ఒకటి రైలును అడ్డుకుంది. దాంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. స్టేషన్‌లో ప్రయాణికులు ఉన్నప్పటికీ ట్రాక్‌పై నుంచి హంసను వెళ్లగొట్టలేకపోయారు. ఎందుకంటే బ్రిటీష్ చట్టాల ప్రకారం హంసలు రాజ కుటుంబ సంపదగా భావిస్తారు. హంసలకు ఎలాంటి హాని కలిగించకూడదు. వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేయకూడదు. అలా చేస్తే అది నేరంగా పరిగణిస్తారు. 12వ శతాబ్ధం నుంచి బ్రిటన్ రాచరిక పాలనలో హంసలకు చెందిన చట్టాలు అమలులో ఉన్నాయి. వేటగాళ్ల నుంచి హంసలను రక్షించాలన్న ఉద్దేశంతో ఆ చట్టాలను పాటిస్తున్నారు. అన్‌మార్క్‌డ్ హంసలను రాజ కుటుంబ సంపదగా భావిస్తారు. సాధారణంగా హంసలపై ఏదైనా గుర్తు పెడుతారు. లేదా వాటి మూతులపై ఏదో ఒక టిక్ వేస్తారు. ఒకవేళ ఆ హంసలపై ఎలాంటి గుర్తు లేకుంటే, అప్పుడు ఆ హంసలను రాజరిక ప్రాపర్టీగా భావించాలి. కేవలం బ్రిటీష్ రాజ కుటుంబీకులు మాత్రమే హంసలను తినేందుకు అధికారం ఉన్నది. అయితే పాతకాలం నాటి చట్టాలను ఇంకా అమలు చేస్తున్నందుకు కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.