జార్జియాలోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో దారుణం సంభవించింది.

జార్జియాలోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో దారుణం సంభవించింది. రెస్టారెంట్లో పనిచేస్తున్న 11 మంది భారతీయులు చనిపోయారని జార్జియా(Georgia) భారతీయ దౌత్య కార్యాలయం తెలిపింది. గుడౌరీలోని పర్వత రిసార్ట్‌కు చెందిన బెడ్‌రూమ్స్‌లో వాళ్లంతా విగతజీవులుగా పడివున్నారని పేర్కొంది. మృతుల వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. గత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు జార్జియా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. వారు ఎలా చనిపోయారో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ దర్యాప్తు మొదలైంది. విషపూరిత వాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చటం వల్లే వాళ్లంతా మరణించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది.

ehatv

ehatv

Next Story