Stock Market : నష్టాలతో మొదలయైన స్టాక్ మార్కెట్ సూచీలు!
స్టాక్ మార్కెట్(stock Market) సూచీలు ఇవాళ నష్టాలతో(Loss) మొదలయ్యాయి.
స్టాక్ మార్కెట్(stock Market) సూచీలు ఇవాళ నష్టాలతో(Loss) మొదలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లలోని(Internation market) ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9.20 గంటల సమయంలో సెన్సెక్స్(Sensex) 136 పాయింట్ల నష్టంతో 81,207 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు కోల్పోయి 24,740 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.63 రూపాయల దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్-30 (Sensex) సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలవ్వడం, లార్జ్‌క్యాప్ స్టాక్స్ నుంచి మదుపర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవటం అక్కడి సూచీలపై ప్రభావం చూపాయి. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. అందుకే నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 84.78 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా 5,483 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) 2,904 కోట్ల రూపాయల వాటాలను విక్రయించారు.