అట్లాంటిక్‌ సముద్రంలో(Atlantic ocean) మునిగిపోయిన టైటానిక్‌(Titanic) నౌక శకాలాలను చూసేందుకు జలాంతర్గామిలో(Submarine) వెళ్లిన వారు కనిపించకుండా పోయారు. ఆ జలాంతర్గామిలో బిలియనీర్లు(Billionaires) ఉన్నారు. వ్యాపారవేత్తలు(Business men) ఉన్నారు. కార్పొరేట్‌(Corporates) ప్రముఖులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని(Pakisthan) అత్యంత సంపన్నుడైన 48 ఏళ్ల షాజాదా దావూద్‌(Shahzada Dawood), ఆయన కుమారుడు 19 ఏళ్ల సులేమాన్(suleman) కూడా ఉన్నారు.

అట్లాంటిక్‌ సముద్రంలో(Atlantic ocean) మునిగిపోయిన టైటానిక్‌(Titanic) నౌక శకాలాలను చూసేందుకు జలాంతర్గామిలో(Mini Submarine) వెళ్లిన వారు కనిపించకుండా పోయారు. ఆ జలాంతర్గామిలో బిలియనీర్లు(Billionaires) ఉన్నారు. వ్యాపారవేత్తలు(Business men) ఉన్నారు. కార్పొరేట్‌(Corporates) ప్రముఖులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని(Pakisthan) అత్యంత సంపన్నుడైన 48 ఏళ్ల షాజాదా దావూద్‌(Shahzada Dawood), ఆయన కుమారుడు 19 ఏళ్ల సులేమాన్(suleman) కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈయన మంచి పైలన్‌ కూడా! ఈ మినీ సబ్‌మెరిన్‌ను నిర్వహిస్తున్న ఓషన్‌గేట్‌ వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రషన్‌(Stockton Rush) ఉన్నారు. వీరితో పాటు బ్రిటన్‌- ఎమిరేట్స్‌ బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌, ఫ్రాన్స్‌కు చెందిన పైలట్‌ పౌల్‌హెన్రీ నార్జియోలెట్‌ కూడా ఉన్నారు. ఈ సబ్‌మెరిన్‌ ప్రమాదంలో గల్లంతైన షాజాద్‌ దావూద్‌ పాకిస్థాన్‌లోనే అత్యంత సంపన్నల్లో ఒకరు.

పాక్‌లోని అతి పెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు(Ingrow Corporation) వైస్‌ ఛైర్మన్‌ ఆయన. ప్రముఖ పారిశ్రామికవేత్త హుస్సేనీ దావూద్‌ కుమారుడు. ఇంగ్రో కార్పొరేషన్‌ కంపెనీ వాహన, ఎరువులు, ఇంధన, డిజిటల్‌ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. బ్రిటన్‌లోని సంపన్న వర్గాలతో దావూద్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. సర్రేలో భార్య క్రిస్టిన్‌, కుమారుడు సులేమాన్‌, కూతురు అలీనాతో కలిసి నివసిస్తున్నాడు. గల్లంతైన జలాంతర్గామిలో షాజాద్‌, సులేమాన్లు ఉన్నట్టు ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. ఈ ప్రమాదంలో యాక్షన్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ హమీష్‌ పేరు అందరికంటే ముందు వెల్లడయ్యింది. హమీష్‌ కంపెనీ హెడ్‌ ఆఫీస్‌ యూఏఈలో ఉంది. ప్రపంచాన్ని విమానంలో అతి వేగంగా చుట్టి వచ్చిన వ్యక్తిగా హమీష్‌ రికార్డు సృష్టించారు.

ఇక ఈ సబ్‌మెరిన్‌ పైలట్‌ పౌల్‌ హెన్రీ ఫ్రెంచ్‌ నౌకాదళంలో కమాండర్‌గా పని చేశారు. నావికుడిగా ఆయనకు పాతికేళ్ల అనుభవం ఉంది. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశాలలో పని చేసే బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించారు కూడా! సముద్రపు లోతుల్లో ఎనిమిది రోజులు సాహస యాత్రకు ప్లాన్‌ చేసింది ఓషన్‌ గేట్‌ సంస్థ. ఇందులో టూర్‌లో టైటానిక్‌ శకలాల సందర్శన కూడా ఉంది. న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి బయలుదేరిన యాత్ర 400 నాటికల్‌ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల దగ్గరకు వెళ్లి రావాల్సి ఉంది. మొదటి రెండు గంటల పాటు ప్రయాణం బాగానే సాగింది. తర్వాత దీనికి సపోర్టింగ్‌ షిప్‌గా వచ్చిన పోలార్‌ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే కీడు శంకించిన రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టింది. నిజానికి సోమవారం మధ్యాహ్నం నాటికి ఆ మినీ సబ్‌మెరిన్‌లో దాదాపు 70 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ఉంది. అంటే వచ్చే శుక్రవారం వరకు సబ్‌మెరిన్‌లో ఉన్నవారికి ఆక్సిజన్‌ సరిపోతుంది. అప్పటి వరకు సబ్‌మెరిన్‌ ఆచూకి దొరికాలని చాలా మంది కోరుకుంటున్నారు.

Updated On 20 Jun 2023 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story