Missing Mini Submarine : ఇంకా దొరకని టైటాన్ ఆచూకి.. మరి సందర్శకుల ప్రాణాల సంగతేమిటి?
అట్లాంటిక్(Atlantic) మహా సముద్రంలో గల్లంతైన మినీ సబ్‌మెరిన్(Mini Submarine) ఆచూకి ఇంకా తెలియరాలేదు. టైటానిక్ నౌక(Titanic ship) శకలాల సందర్శన కోసం వెళ్లిన టైటాన్ జలంతర్గామి కోసం అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉంటే సముద్ర అంతర్భాగం నుంచి కొన్ని శబ్దాలు(Sounds) వెలువడుతున్నట్టు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టింది.
అట్లాంటిక్(Atlantic Ocean) మహా సముద్రంలో గల్లంతైన మినీ సబ్‌మెరిన్(Mini Submarine) ఆచూకి ఇంకా తెలియరాలేదు. టైటానిక్ నౌక(Titanic ship) శకలాల సందర్శన కోసం వెళ్లిన టైటాన్ జలంతర్గామి కోసం అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉంటే సముద్ర అంతర్భాగం నుంచి కొన్ని శబ్దాలు(Sounds) వెలువడుతున్నట్టు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టింది. కొత్త ఆశలను రేకెత్తించింది. టైటాన్ గల్లంతయినట్టుగా అనుమానిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి అరగంటకోసారి బిగ్గరగా శబ్దాలు వస్తున్నాయట. అయితే ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. టైటాన్‌లో కొంత ఆక్సిజన్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చని కొందరు అంటున్నారు.
కనిపించకుండా పోయిన సబ్‌మెరిన్ టైటాన్ జాడ కోసం జాన్ కాబోట్(John Cabot), స్కాండీ విన్‌ల్యాండ్(Scandi Vinland), అట్లాంటక్ మెర్లిన్(Atlantic Merlin) అనే మూడు పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. ప్రస్తుతం టైటాన్ సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల లోతున ఉన్నదట! 3,800 మీటర్ల లోతన్న మాట! ఇదేం సామాన్యమైన లోతు కాదు. అక్కడి వరకు సురక్షితంగా చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే అండర్‌వాటర్ రోబోను పంపించారు. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన మూడు సి-17 రవాణా విమానాలను అక్కడికి పంపించారు. ఒక పెట్రోలింగ్ విమానం, రెండు నౌకలతో కెనాడా సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. గురువారం ఉదయానికి టైటాన్‌లోని మొత్తం ఆక్సిజన్ ఖర్చయిపోతుంది. అప్పటిలోగా టైటాన్ జాడ తెలియకపోతే మాత్రం అందులో ఉన్న సందర్శకుల ప్రాణాలతో బయటపడటం అన్నది సంక్లిష్టమవుతుంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు నాలుగు రోజులకు సరిపా ఆక్సిజన్‌తో టైటాన్ సబ్‌మెరిన్ టైటానిక్ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. టైటాన్‌లో రెండు రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటే, నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే ఆ రెండు వ్యవస్థలు పనిచేయడం మానేశాయి. ఈ సబ్‌మెరిన్‌లో ఓషియన్ గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్‌టన్ ష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హహిష్ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన అత్యంత ధనవంతుడు షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్ హెన్రీ నార్జియోలెట్ ఉన్నారు. వీరంతా 1912లో అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ శిథిలాలను సందర్శించడానికి టైటాన్ జలాంతర్గామిలో వెళ్లారు. ఈ అయిదుగురు సందర్శకులు క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు. వారి క్షేమాన్ని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.. మన కూడా వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుందాం!