తమిళనాడులోని(tamilnadu) ఓ మారుమూల చిన్న గ్రామం చూపు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా మీద ఉంది.

తమిళనాడులోని(tamilnadu) ఓ మారుమూల చిన్న గ్రామం చూపు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా మీద ఉంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌(Kamla harris) డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా(Presidant candidate) ఆమె నామినేట్‌ అయ్యే అవకాశాలు ఇప్పుడు మెరుగయ్యాయి కాబట్టే తులసేంద్రపురం(thulasendrapuram) ప్రజలలో ఓ రకమైన ఆనందం కలిపిస్తోంది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌(Joe Bidden) తప్పుకోవడంతో డెమోక్రటిక్‌ పార్టీలో(Democratic party) సస్పెన్స్‌ అయితే కొనసాగుతోంది. బరిలో ఎవరు నిలుస్తారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి ఎవరనేది తేలనుంది. కమలా హారీస్‌ అభ్యర్థిత్వానికి బైడెన్‌ మద్దతు ప్రకటించారు కానీ ఒబామా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే కమలా హారిస్‌ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది. 4700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. వీరితో పాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును కూడా కమలా హారీస్‌ కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌లు హారీస్‌కు మద్దతు ఇచ్చారు.

వాషింగ్టన్‌కు 12,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసేంద్రపురం ప్రజలు మాత్రం కమలా హారిస్‌ అధ్యక్షురాలు అవ్వడం గ్యారంటీ అని గట్టిగా నమ్ముతున్నారు. కమల తల్లిగారి పూర్వీకులదే తులసేంద్రపురం. అయిదేళ్ల వయసున్నప్పుడు కమల ఈ ఊరును సందర్శించారు. తాతగారితో పాటు చెన్నైలో ఉన్న కమల ఆయనతో పాటు ఉదయం వేళ బీచ్‌లో నడిచేవారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత కమలా హారిస్‌ కోసం తులసేంద్రపురం వేయి కన్నులతో ఎదురుచూసింది. కానీ ఆమె రాలేదు. అయినప్పటికీ గ్రామ ప్రజలు మాత్రం ఆనందోత్సాహాలతో ఉత్సవం జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఆమె చిత్రాలను పంచిపెట్టారు. మిఠాయిలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తమ ఊరు అమ్మాయి ఉన్నత పదవిలో ఉన్నందుకు ప్రజలు ఎంతో సంబరపడ్డారు. డెమోక్రటిక్‌ పార్టీ తరపున ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి, విజయం సాధిస్తే మాత్రం చాలా గొప్పగా వేడుక చేసుకుంటామని గ్రామ కమిటీ సభ్యుడు కాళియపెరుమాళ్‌ చెప్పారు. ఇటీవల టీ-20 క్రికెట్‌ ప్రపంచకప్‌లో ఇండియా సాధించిన విజయం కంటే దీన్నే గొప్ప విజయంగా భావిస్తామని అన్నారు. నేషనల్‌ ఛానెల్స్‌లో వచ్చే వార్తలతో ప్రతి రోజూ అప్‌డేట్స్‌ను తెలుసుకుంటున్నామని అన్నారు. కమలాహారిస్‌ ఉపాధ్యక్షురాలు అయినప్పుడు తులసేంద్రపురంలోని ఇంటింటా ఆమె ఫోటోలు దర్శనమిచ్చాయి. 1930లో గ్రామం వదిలివెళ్లిపోయిన కమలా హారిస్‌ పూర్వీకులు తమ జ్ఞాపకార్థం ఓ ఆలయాన్ని నిర్మించి వెళ్లారు. కమలా హారిస్‌కు తులసేంద్రపురం గ్రామ ప్రజల ఉద్వేగాల గురించి, తన విజయం కోసం ప్రజలు ఎంతగా ప్రార్థిస్తున్నారో ఆమెకు తెలియకపోవచ్చు. కానీ గ్రామ ప్రజలు మాత్రం ఆమెను తమ అమ్మాయిగానే భావిస్తున్నారు. ఆమె విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story