ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (monkeypox) కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (monkeypox) కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పొరుగు దేశం పాకిస్థాన్‌లో(Pakistan) కూడా మంకీపాక్స్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు సౌదీ అరేబియా(Saudi Arabia) నుండి పాకిస్తాన్‌లోని కరాచీ(Karachi) విమానాశ్రయానికి(Airport) చేరుకున్న ముగ్గురు ప్రయాణీకులకు మెడికల్ స్క్రీనింగ్ సమయంలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి, దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముగ్గురు ప్రయాణికులను నిపా ప్రాంతంలోని సింధ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు ARY న్యూస్ నివేదించింది. విమానాశ్రయ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఇమ్మిగ్రేషన్ ప్రాంతం, నడక మార్గాలను క్రిమిసంహారక మందుల‌ను స్ప్రే చేశారని తెలిపింది.

అంతకుముందు సెప్టెంబర్ 20న జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. తదుపరి పరీక్షల నిమిత్తం ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చారు. రోగి సౌదీ అరేబియాలోని జెడ్డాలోని అబోటాబాద్‌కు చెందిన 26 ఏళ్ల వ్యక్తి. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత హెల్త్ చెక‌ప్‌ సమయంలో ఆ వ్యక్తికి M-పాక్స్ ల‌క్ష‌ణాలు ఉన్నట్లు గుర్తించారు.

Eha Tv

Eha Tv

Next Story