Helicopters collide In California : అడవిలో మంటలను ఆర్పడానికి వెళ్లి ... పరస్పరం ఢీకొన్ని హెలికాఫ్టర్లు
కాలిఫోర్నియాలో(California) రెండు హెలికాఫ్టర్లు(Helicpoters) పరస్పరం ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు చనిపోయారు. కాలిఫోర్నియాలోని(California) కాబాజోన్(Cabazon) ప్రాంతంలో ఆదివారం అడవి అంటుకుంది.

Helicopters collide In California
కాలిఫోర్నియాలో(California) రెండు హెలికాఫ్టర్లు(Helicpoters) పరస్పరం ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు చనిపోయారు. కాలిఫోర్నియాలోని(California) కాబాజోన్(Cabazon) ప్రాంతంలో ఆదివారం అడవి అంటుకుంది. దావానలం వ్యాపిస్తుండటంతో దాన్ని ఆర్పడానికి కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం రెండు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది. మంటలను అదుపు చేసే క్రమంలో దట్టమైన పొగ కారణంగా హెలికాఫ్టర్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎయిర్ ఎమర్జెన్సీ సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లలో ఉన్న సిబ్బంది వివరాలు సేకరిస్తున్నాం’ అని కాలిఫోర్నియా అటవీ, అగ్నిమాపక సంరక్షణ విభాగం ప్రతినిధి రిచర్డ్ కోర్డోవా తెలిపారు.
