ముగ్గురు బంగ్లాదేశస్తులు(Bangladesh) ఉపాధి నిమిత్తం భారత్‌కు(India) వచ్చారు.

ముగ్గురు బంగ్లాదేశస్తులు(Bangladesh) ఉపాధి నిమిత్తం భారత్‌కు(India) వచ్చారు. రాలేదు కిడ్నీలను కిడ్నాప్‌ చేసే ముఠా వారిని రప్పించింది. 20 ఏళ్ల క్రితం

బాలీవుడ్ చిత్రం 'రన్' కిడ్నీ మార్పిడి మోసగాళ్ల వలలో చిక్కుకోవడానికి ఒక యువకుడు ఉపాధి కోసం ఢిల్లీకి వెళ్లడాన్ని చిత్రీకరించారు. ఇదే తరహా వ్యవహారం ఇప్పుడు బయటపడింది. ఉపాధి పేరుతో ప్రలోభపెట్టి భారతదేశానికి రప్పించి, వైద్య పరీక్షల ముసుగులో వారి కిడ్నీలను కొల్లగొట్టేసి బ్యాంకు ఖాతాల్లో కొంత డబ్బు జమచేస్తారు. ఇలా ముగ్గురి కిడ్నీలను(Kidney) దొంగిలించిన వ్యవహారం బయటకొచ్చింది.

ఓ వ్యక్తి బంగ్లాదేశ్‌లో బట్టల వ్యాపారం చేసేవాడు. అగ్నిప్రమాదంలో తన షాప్‌ దగ్ధమైంది. దీంతో 8 లక్షల అప్పులు చేశాడు. అందులో మూడు లక్షలు రుణం తీర్చినా మరో 5 లక్షల రుణం ఉండడంతో అప్పు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. దీంతో భారత్‌కు వెళ్లాలని ఓ స్నేహితుడు చెప్పడంతో వచ్చాను. కిడ్నీల మార్పిడి ముఠాకు పరిచయం చేయడంతో వారు వైద్య పరీక్షల పేరుతో మత్తులోకి దించి అతని కిడ్నీని కొల్లగాట్టారు.

మరో వ్యక్తి తస్కిన్‌ కూడా భారత్‌కు ఉపాధి కోసం వచ్చాడు. ఫిబ్రవరి 2న భారత్‌కు వచ్చాడు. విమానాశ్రయంలో రాసెల్, మహ్మద్‌ రోకాన్ అనే వ్యక్తులు స్వాగతం తెలిపి జసోలాలోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. భారతీయ నిబంధనలకు అనుగుణంగా నేను వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి పలు రకాల పరీక్షలతో పాటు ఈసీజీ చేశారు. ఏప్రిల్‌ 2న ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఒక నర్సు మత్తు పదార్థం ఇచ్చింది. స్పృహ కోల్పోయిన తర్వాత పొత్తికడుపై మచ్చ, కుట్లు చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ హోటల్‌కు తీసుకెళ్లి బ్యాంక్‌ ఖాతాలో డబ్బు జమ చేశారు.

మరో వ్యక్తికి ఇదే చేదు అనుభవం ఎదురైంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మాడు. భారత్‌లో ఉద్యోగం, శిక్షణ సమయంలో స్టయిఫండ్‌ అంటూ నమ్మబలికాడు. వైద్య పరీక్షల పేరుతో 4, 5 రోజులు ఆస్పత్రి చుట్టూ తిప్పి రకరకాల వైద్య పరీక్షలు చేశారు. ఆ నాలుగు రోజుల్లో రక్తం తీయడంతో బలహీనపడి స్పృహకోల్పోయాడు. తేరుకునేసరికి తన కిడ్నీ మాయమైనట్లు గుర్తించాడు. కిడ్నీ తీసుకున్నామని, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కిడ్నీతో జీవించగలవని తెలిపారు. ఇందుకుగాను రూ.4.5 లక్షల సొమ్ము కూడా చెల్లించారు. ఈ ముగ్గురిని స్వదేశానికి తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story