మనం నివసిస్తున్న భూమి సురక్షితమని అనుకుంటాం. కానీ ఎప్పుడూ ఏదో ఒక ముప్పు వస్తూనే ఉంది. అనేకానేక ప్రమాదాల నుంచి భూమి తనను తాను రక్షించుకుంటూ మనుగడసాగిస్తోంది. భూమికి ఉన్న అతి పెద్ద ముప్పేమిటంటే గ్రహశకలాలు(Asteroid). తరచూ ఇవి భూమివైపుకు వస్తూనే ఉన్నాయి. ఒకట్రెండు భూమిని ఢీకొట్టాయి కూడా! మంచుయుగం ఏర్పడింది.

మనం నివసిస్తున్న భూమి సురక్షితమని అనుకుంటాం. కానీ ఎప్పుడూ ఏదో ఒక ముప్పు వస్తూనే ఉంది. అనేకానేక ప్రమాదాల నుంచి భూమి తనను తాను రక్షించుకుంటూ మనుగడసాగిస్తోంది. భూమికి ఉన్న అతి పెద్ద ముప్పేమిటంటే గ్రహశకలాలు(Asteroid). తరచూ ఇవి భూమివైపుకు వస్తూనే ఉన్నాయి. ఒకట్రెండు భూమిని ఢీకొట్టాయి కూడా! మంచుయుగం ఏర్పడింది అలాగే! డైనోసార్ల వంటి భారీ జంతువులుఅంతరించిపోయింది కూడా గ్రహశకలం ఢీ కొట్టడం వల్లే. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే 2023 డీజెడ్‌ 2 అనే గ్రహశకలం భూమి, చంద్రుడి కక్ష్యల మధ్య నుంచి ప్రయాణించబోతుంది. ఈ ఖగోళ అద్భుతం ఇవాళే చోటు చేసుకోబోతంది. చందమామ కంటే దగ్గరగా వస్తున్న ఈ గ్రహశకలానని నెలరోజు కిందట కనుగొన్నారు. పొరపాటున ఇది భూమిని ఢీకొంటే మాత్రం కొన్ని నగరాలే భస్మీపటలవుతాయి. కాకపోతే దీని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

శనివారం భూమికి 1,68,000 కిలోమీటర్ల దూరం నుంచి గ్రహశకలం ప్రయాణిస్తుంది. ఈ సమయం కోసం శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గ్రహశకలాలు ఇలా దగ్గరగా రావడం చాలా అరుదు కాబట్టి. గ్రహశకలాన్ని అధ్యయనం చేసే ఛాన్స్‌ లభిస్తుంది కాబట్టి. అన్నట్టు ఈ గ్రహశకలాన్ని చిన్న పాటి టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. అయితే ఆగ్నేయ ఆసియా దేశాల వారికి మాత్రమే చూసే అదృష్టం ఉంది. మనకు ఇది కనిపించదు. సుమారు 300 అడుగుల వెడల్పు ఉన్న ఈ శకలాన్ని పరిశీలించడానికి సైంటిస్టులు రెడీ అయ్యారు. పదేళ్లకో, పదిహేనేళ్లకో ఏదైనా గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయి. 2023 డీజెడ్‌ 2 గ్రహశకలాన్ని యూరోపియన్‌ నియర్‌ ఎర్త్‌ ఆస్ట్రరాయిడ్స్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులో భాగంగా గుర్తించారు. ఇది సూర్యుడు చుట్టూ తిరగడానికి 3.16 ఏళ్లు పడుతుంది. మళ్లీ మూడేళ్ల తర్వాత భూమికి దగ్గరగా రావచ్చు. ఇప్పుడైతే ప్రమాదం లేదు కానీ ఎప్పుడైనా దీనితో ముప్పేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Updated On 25 March 2023 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story