పెంట్‌ హౌస్‌(Pent House) రేటు ఎంత ఉంటుంది? మహా అయితే రెండు మూడు కోట్లు..కాస్లీ ఏరియాలలో అయిదారు కోట్లు ఉంటుంది. ముంబాయి(Mumbai) వంటి నగరాలలో అయితే అరవై డెబ్భై కోట్లు ఉంటుంది. కానీ దుబాయ్‌(Dubai)లో నిర్మిస్తున్న ఓ పెంట్‌హౌస్‌ రేటు వింటే మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం!

పెంట్‌ హౌస్‌(Pent House) రేటు ఎంత ఉంటుంది? మహా అయితే రెండు మూడు కోట్లు..కాస్లీ ఏరియాలలో అయిదారు కోట్లు ఉంటుంది. ముంబాయి(Mumbai) వంటి నగరాలలో అయితే అరవై డెబ్భై కోట్లు ఉంటుంది. కానీ దుబాయ్‌(Dubai)లో నిర్మిస్తున్న ఓ పెంట్‌హౌస్‌ రేటు వింటే మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం! ఆ నగరంలో అత్యంత ఖరీదైన పామ్‌ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్‌ అనే 71 అంతస్తుల భవంతిపై నిర్మిస్తున్న పెంట్‌ హౌస్‌ కోసం డబ్బున్నవారంతా పోటీ పడ్డారు. చివరకు ఓ వ్యక్తి 1, 333 కోట్ల రూపాయలిచ్చి కొనేసుకున్నాడు. ఫైవ్‌ బెడ్‌రూమ్‌లున్న ఈ పెంట్‌హౌస్‌ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. మన దగ్గరైతే నాలుగువేల చదరపు అడుగుల ఫ్లాట్‌నే లంకంత కొంప అని అనేస్తాం.. మరి ఈ పెంట్‌హౌస్‌ను ఏమనాలో! ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంది. దీనిపై నుంచి చూస్తే బుర్జ్‌ ఖలీఫా, బుర్గ్‌ అల్‌ అరబ్‌, దుబాయ్‌ మరీనా వంటి ఆకాశహర్మ్యాలెన్నో కనిపిస్తాయి. ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక్కో ఫ్లోర్‌కు ఒకటి, రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. అన్నట్టు ప్రపంచ రియల్టీ మార్కెట్‌లో అత్యంత ఎక్కువ ధర పలికి మూడో పెంట్‌ హౌస్‌ ఇదేనట! అంటే ఇంతకు ముందు ఇంతకంటే ఎక్కువ పలికిన పెంట్‌హౌస్‌లు ఉన్నాయన్నమాట! మెనాకోలోని ఓడియన్‌ టవర్‌ పెంట్‌హౌస్‌ 3,670 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది. ఇక లండన్‌లోని వన్‌హైడ్‌ పార్క్‌ పెంట్‌హౌస్‌ 1,975 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది. దుబాయ్‌ వరకైతే మాత్రం కోమా రెసిడెన్సెస్‌ పెంట్‌హౌస్‌దే రికార్డు. 2027లో కోమో టవర్‌ నిర్మాణం పూర్తవుతుంది. అప్పుడు పెంట్‌హౌస్‌ను కొనుక్కున్న వ్యక్తికి దానిని అప్పగిస్తారు. ఆ కుబేరుడెవరో చెప్పడంలేదు. తూర్పు యూరప్‌ ప్రాంతానికి చెందిన వాడని మాత్రం నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్‌ ఎస్టేట్‌ చెప్పింది. కొద్ది నెలల కిందట మర్సా అల్ అరబ్‌ హోటల్ పెంట్‌హౌస్‌ 956 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది.

Updated On 7 Dec 2023 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story