దొంగతనానికి(Theft) వెళ్లినప్పడు అదే పని చేయాలి.

దొంగతనానికి(Theft) వెళ్లినప్పడు అదే పని చేయాలి. అంతేకానీ వేరే వ్యాపకాలు పెట్టుకోకూడదు. అలా చేస్తే అడ్డంగా దొరికిపోతారు. ఇటలీ(Italy) రాజధాని రోమ్‌లో(Rome) ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనే జరిగింది. 38 ఏళ్ల ఓ దొంగగారు దొంగతనం కోసం ఓ ఇంట్లో దూరాడు. టేబుల్‌పై ఉన్న ఓ పుస్తకం(Book) ఆ దొంగను అమితంగా ఆకట్టుకుంది. అంతే వచ్చిన పని మర్చిపోయి పుస్తకం చదవడంలో నిమగ్నమయ్యాడు. పూర్తిగా అందులోనే మునిగిపోయాడు. ఇంటి యజమాని వచ్చి తడితే కానీ అతగాడు ఈ లోకంలోకి రాలేదు. ఇంటి యజమానిని చూసి దొంగ బిత్తరపోయాడు. పరారవ్వడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చేసి అతడిని పట్టుకున్నారు. దొంగను అంతగా ఆకట్టుకున్న ఆ పుస్తకమేమిటంటే ప్రముఖ రచయిత గియోవన్నీ రాసిన ది గాడ్స్‌ ఎట్‌ సిక్స్‌ ఓ క్లాక్‌(The God At 6 O clock). గ్రీకు పురాణాలకు సంబంధించిన పుస్తకమన్నమాట! దొంగలకు సాహిత్యాభిలాష ఉన్నా కష్టమే సుమీ!

Eha Tv

Eha Tv

Next Story