రష్యా(Russsia) కిరాయి సైన్యం వాగ్నర్ చీఫ్‌ ప్రిగోజిన్‌ను(Wagner Chief Prigogine) ఆ దేశ అధ్యక్షుడు పుతినే(Vladimir Putin) చంపించాడని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌(Wall Street Journal) సంచలన స్టోరీ ప్రచురించింది. ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్న విమానానికి బాంబు(Bomb) అమర్చి హత్యచేశాడని ఓ కథనాన్ని వెలువురించింది. విమాన ప్రమాదంలో మరణించాడని రష్యా అధ్యక్షుడు చెప్పినా.. ప్రిగోజిన్‌ హత్య వెనుక కుట్ర దాగి ఉందని తెలిపింది.

ప్రిగోజిన్‌ మృతిపై ఇప్పటికే అనుమానాలు ఉండడంతో ఈ కథనంతో ఆ వాదనలకు బలం చేకూరింది. పుతిన్‌కు కుడిభుజంగా ఉండే ఆ దేశ భద్రతా కౌన్సిల్ కార్యదర్శి నికోలయ్‌ పత్రుషేవ్(Nikolai Patrushev)..పుతిన్‌ అనుమతితో హత్య చేయించాడని వాల్‌స్ట్రీట్ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం సందర్భంగా రష్యా సైన్యంలో కీలక పాత్ర పోషించిన ప్రిగోజిన్... ఆ తర్వాత అధ్యక్షుడు పుతిన్‌తో విభేదాలు వచ్చాయి. రష్యా అధ్యక్షుడిపై తిరుగుబాటుకు ప్రయత్నించిన ప్రిగోజిన్.. బెలారస్‌ అధ్యక్షుడి మధ్వవర్తిత్వంతో ఇది నిలిచిపోయింది. అయినప్పటికీ ప్రిగోజిన్‌తో ఎప్పటికైనా ముప్పేనని భావించిన నికోలయ్‌ అతడిని అంతమొందిచాలని ప్లాన్‌ వేశాడట. రష్యాలో పుతిన్‌ తర్వాత అత్యంత శక్తివంతుడని భావించే ప్రిగోజిన్‌ను హతమార్చాలని.. అందుకు పుతిన్‌ కూడా అంగీకరించారని వాల్‌స్ట్రీట్‌ కథనం.

మాస్కో(Moscow) ఎయిర్‌పోర్టులో ప్రిగోజిన్(Prigogine) విమానం ఉండగా.. దాని రెక్క కింద చిన్న బాంబు అమర్చడంతో అది పేలడంతో ప్రిగోజిన్‌ సహా పలువురు సజీవదహనమైనట్లు తెలిపింది. విమానంలో తీసుకెళ్తున్న గ్రెనేడ్లు పేలడంతోనే ప్రమాదం జరిగిందన్న పుతిన్‌ వ్యాఖ్యలను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఖండించింది. కాగా ఈ కథనాలను క్రెమిన్ ఖండించింది. అవన్ని కట్టుకథలేనని కొట్టిపారేసింది.

Updated On 23 Dec 2023 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story