సాధారణంగా మన పక్కవారు హఠాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తాం.

సాధారణంగా మన పక్కవారు హఠాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తాం. సీపీఆర్‌(CPR) చేసి, చేతులు, కాళ్లను రబ్‌చేసి ఎలాగైనా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ పక్షులకు(Birds) కూడా గుండెపోటు వస్తుందని మీరు ఊహిస్తారా. ఒకవేళ గుండెపోటు వచ్చినా తోటి పక్షి దానికి సీపీఆర్‌ చేయడం చూశారా. అవును ఈ వీడియోలో ఇదే జరిగింది. సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అందరి హృదయాలను హత్తుకునే వీడియో ఒకటి సోషల్ మీడియాలో(social media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ వచ్చి హఠాత్తుగా కింద పడిపోయింది. దాని శ్వాస కూడా ఆడడం లేదు. వెంటనే మరో పక్షి అక్కడికి వచ్చి కిందపడిపోయిన పక్షిని బతికించేందుకు చేయని ప్రయత్నం లేదు. తన స్నేహితుడిని కాపాడేందుకు ఆ పక్షి సీపీఆర్‌ చేసింది. రెండు నిమిషాల ప్రయత్నం తర్వాత కింద పడిపోయి ఉన్న పక్షి ప్రాణాలతో బయటపడింది. వెంటనే అక్కడి నుంచి రెండు పక్షులు గిర్రున లేచి ఎగిరిపోయాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆశ్చర్యపోయారు. ఈ కాలంలో మనుషుల కన్నా పక్షులకే 'పక్షితత్వం' ఎక్కువ ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story