✕
Red Wine On Streets : వీధుల్లో వెల్లువలా ప్రవహించిన రెడ్‌వైన్... ఎక్కడంటే...!
By EhatvPublished on 12 Sep 2023 2:20 AM GMT
పోర్చుగల్‌లోని(Portugal) సావో లోరెంకో డీ బైరో(São Lourenço de Bairro) వీధుల్లో రెడ్‌వైన్(Red wine) వరదలా ప్రవహించింది. ఆ చిన్నపట్టణంలో ఎక్కడా చూసినా రెడ్ వైన్ ప్రవాహామే కనిపించింది. వేల కొద్ది లీటర్ల రెడ్‌వైన్ అలా ప్రవహిస్తూ పోయింది.

x
Red Wine On Streets
-
- పోర్చుగల్‌లోని(Portugal) సావో లోరెంకో డీ బైరో(São Lourenço de Bairro) వీధుల్లో రెడ్‌వైన్(Red wine) వరదలా ప్రవహించింది. ఆ చిన్నపట్టణంలో ఎక్కడా చూసినా రెడ్ వైన్ ప్రవాహామే కనిపించింది. వేల కొద్ది లీటర్ల రెడ్‌వైన్ అలా ప్రవహిస్తూ పోయింది. ఎత్తయిన ప్రదేశం నుంచి కింద ఉన్న వీధుల దిశగా వైన్ పారింది. జరిగిందేమిటంటే పట్టణంలో ఉన్న డిస్టిల్లరీ నుంచి బ్యారెళ్లు పేలడంతో అందులో ఉన్న వైన్ అంతా లీకయ్యింది. ఆ రెడ్‌వైన్ అంతా దగ్గరలో ఉన్న సెర్టిమా నదిలో కలిసింది. అగ్నిమాపక శాఖ రంగంలో దిగి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేసింది కానీ.. దాని వల్ల కాలేదు. ఈ ఘటన పట్ల లెవిరా డిస్టిల్లరీ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. వీధులను తామే శుభ్రం చేస్తామంది. ఈ ప్రవాహం కారణంగా జరిగిన నష్టాన్ని తామే పూడుస్తామని కూడా తెలిపింది.

Ehatv
Next Story