Kim Yo Jong dangerous Woman : ప్రపంచంలో అత్యంత క్రూరమైన, ప్రమాదకరమైన మహిళ ఎవరో తెలుసా?
ప్రస్తుతం ది సిస్టర్(The Sister) అనే పుస్తకం నలుగురి నోళ్లల్లో నానుతోంది. అందుకు కారణం ఆ పుస్తకంలో కొన్ని సంచలన వివరాలు ఉన్నాయి కాబట్టి! ఇటీవల ఆవిష్కరణ జరిగిన ఆ పుస్తకాన్ని ఉత్తర కొరియా(North Korea) మూలాలుండి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్ యూన్ లీ(Sung Yoon Lee) రాశారు. ఆ పుస్తకాన్ని ట్యాగ్‌లైన్‌గా నార్త్ కొరియా కిమ్ యో జోంగ్(Kim Yo Jong), ది మోస్ట్ డేంజరస్(The most dangerous Woman) ఉమెన్ అని పెట్టారు.
ప్రస్తుతం ది సిస్టర్(The Sister) అనే పుస్తకం నలుగురి నోళ్లల్లో నానుతోంది. అందుకు కారణం ఆ పుస్తకంలో కొన్ని సంచలన వివరాలు ఉన్నాయి కాబట్టి! ఇటీవల ఆవిష్కరణ జరిగిన ఆ పుస్తకాన్ని ఉత్తర కొరియా(North Korea) మూలాలుండి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్ యూన్ లీ(Sung Yoon Lee) రాశారు. ఆ పుస్తకాన్ని ట్యాగ్‌లైన్‌గా నార్త్ కొరియా కిమ్ యో జోంగ్(Kim Yo Jong), ది మోస్ట్ డేంజరస్(The most dangerous Woman) ఉమెన్ అని పెట్టారు. ట్యాగ్‌లైన్ చూస్తే ఆ పుస్తకాన్ని ఎవరిని ఉద్దేశించి రాశారో తెలిసిపోతున్నది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ గురించి జనాలకు తెలియని చాలా విషయంలో ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఆమె ఎలా మారిందో చక్కగా వివరించారు. కిమ్ యో జోంగ్ అత్యంత క్రూరమైన మహిళ అని, ఆమెను చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళ అని అనడంలో ఏ మాత్రం తప్పులేదని పుస్తకంలో చెప్పారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సోదరికి సంబంధించిన మొదటి ఫొటో తొమ్మిదో దశకం ఆరంభంలో బయటకు వచ్చింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సమయంలో ఆ ఫోటో వెలుగులోకి వచ్చింది. అప్పుడు కిమ్ యో జోంగ్ వయసు పదేళ్లు. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఆరోగ్యం క్షీణించడంతో సోదరి కిమ్ యో జోంగ్‌కు పాలనాపగ్గాలను అప్పగించే అవకాశం ఉందనే చర్చ తరచూ వినిపిస్తూ ఉంటుంది.
కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె ఏకైక సోదరి కాబట్టి గారబంగా పెరిగింది. పైగా పరిపాలనలో కూడా మెను భాగస్వామిని చేశాడు కిమ్ జోంగ్. ఉత్తర కొరియా పాలనలో ఆమె కీలక భూమిని పోషిస్తుంటారు. ఎప్పుడూ కిమ్ జోంగ్ పక్కనే కనిపిస్తుంటారు. ఇటీవల అన్న కిమ్‌జోంగ్‌తో కలిసి రష్యా కూడా వెళ్లి వచ్చారు. అక్కడ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సోదరునికి సహాయం చేశారు.
ది సిస్టర్ పుస్తక రచయిత్రి సంగ్ యూన్ లీ వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్(International Center for Scholars) సభ్యులు కూడా! ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడైనా ఖాళీ అయితే, వెంటనే ఆమె ఈ పదవిని చేపట్టి నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలున్నాయన్నది సంగ్ యూన్ లీ గట్టి భావన.
గత కొన్నేళ్లుగా ఆమె తన అన్నకు అడుగడుగునా అండగా నిలిచారని పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెకు తన సోదరుని ప్రతి రహస్యం తెలుసని, అతని మామ హత్యలో కనికరం లేకుండా తన సోదరునికి అండగా నిలిచారని రాశారు. ఉత్తర కొరియా ఎలాంటి దేశమో అందరికీ తెలుసు. ఆ దేశంలో నమ్మదగిన సమాచారాన్ని పొందడం దుర్లభం. కానీ ఈ పుస్తకంలో నియంత సోదరి గురించి పరిశోధించిన అంశాలు చాలానే ఉన్నాయి. 2020లో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఆమె దేశంలోని అన్ని వ్యవహారాలను చూసుకుంటుంటున్నారని ఆ పుస్తకంలో చెప్పారు. దక్షిణ కొరియాలోని గాంగ్‌నెంగ్‌లో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జోంగ్ మహిళల ఐస్ హాకీ గేమ్‌లో పోటీ పడింది. దక్షిణ కొరియాలో ఆమె స్నేహపూర్వక ప్రవర్తనను చూపినప్పుడు జనం ఆమెను చూసి గర్వపడ్డారు.
ఈ నేపధ్యంలో ఆమెను అందరూ రాజకుమారి అని ప్రశంసించారు. అయితే అధికార పాలనలో భాగస్వామ్యం లభించిన తర్వాత ఆమె తన పవర్‌ను పెంచుకుంటూ వస్తోంది. ఆమె పాంపర్డ్ లగ్జరీలో పెరిగిందని, మొదటి నుంచి ఆమెను నిబంధనలకు అతీతంగా పెంచారని ది సిస్టర్ పుస్తకంలో రాశారు. సోదరునిలాగే ఆమె స్విస్ బోర్డింగ్ స్కూల్‌లో కొన్నేళ్లు చదువుకున్నారని, ఆమెకు కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి కిమ్ జోంగ్ సింగపూర్ వచ్చినప్పుడు, ఆమె తన సోదరునితో పాటు అక్కడే ఉంది. కిమ్ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని పుస్తకంలో తెలిపారు. ఆమెను దేశంలోని కొందరు దెయ్యం మహిళ, అహంకార యువరాణి,సహ నియంత అని పిలుస్తుంటారు. ఉత్తర కొరియాలోని 25 మిలియన్ల మంది పౌరులు కిమ్ కుటుంబాన్ని ఆరాధిస్తుంటారని, వారు సాగించే అవినీతి గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తారని పుస్తకంలో సంగ్ యూన్ లీ తెలిపారు."Written By : Senior Journalist M.Phani Kumar"