ఇజ్రాయెల్‌(Isreal)-హమాస్‌(Hamas) మధ్య యుద్ధంతో చాలా మంది గత చరిత్రను తవ్వడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడిందో తెలుసుకోగలుగుతున్నారు. యూదుల(Jews) లైఫ్‌ స్టయిల్‌పై(Life style) ఆసక్తి పెంచుకుంటున్నారు. పాలస్తీనాను ఎలా కబళించివేశారో గ్రహించగలుగుతున్నారు. ఇలా చరిత్ర చదువుతున్న వారికి జెరూసలేంలో ఉన్న ఓ విచిత్రమైన నిచ్చెన(Ladder) తారసపడింది.

ఇజ్రాయెల్‌(Isreal)-హమాస్‌(Hamas) మధ్య యుద్ధంతో చాలా మంది గత చరిత్రను తవ్వడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడిందో తెలుసుకోగలుగుతున్నారు. యూదుల(Jews) లైఫ్‌ స్టయిల్‌పై(Life style) ఆసక్తి పెంచుకుంటున్నారు. పాలస్తీనాను ఎలా కబళించివేశారో గ్రహించగలుగుతున్నారు. ఇలా చరిత్ర చదువుతున్న వారికి జెరూసలేంలో ఉన్న ఓ విచిత్రమైన నిచ్చెన(Ladder) తారసపడింది. ఏమిటా నిచ్చెన? దాని ప్రాముఖ్యత ఏమిటి? అన్నది తెలుసుకుందాం! జెరూసలెం(Jerusalem) గురించి ఇప్పుడు రెండు మతాలు కొట్టుకుంటున్నాయి. ఇది తమ రాజధాని అని ఇజ్రాయెల్‌ చెబుతోంది. కాదు ఇది తమ ప్రాంతమేనని పాలస్తీనా(Palestine) గట్టిగా వాదిస్తోంది. ఈ నగరం కోసం ఇజ్రాయెల్‌, పాలస్తీనాలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. నిజానికి ఈ ప్రదేశం నుండే ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలైన క్రైస్తవం(Christianity), ఇస్లాం(Islam), జుడాయిజం(Judaism) స్థాపితమయ్యాయని చెబుతారు. జెరూసలేంలో చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ అనే క్రైస్తవ చర్చి ఉంది. ఏసుక్రీస్తుకు ఇక్కడే శిలువ వేశారని, తర్వాత ఇక్కడే తిరిగి అవతరించారని క్రైస్తవులు బలంగా విశ్వసిస్తారు. అయితే ఈ చర్చిలో క్రైస్తవ మతంలోని వివిధ వర్గాల సంప్రదాయరీతులు నడుస్తుంటాయి. అయితే ఈ చర్చిలో ఒక ప్రత్యేకమైన నిచ్చెన ఉంది. ఇవి వివాదాస్పదంగా నిలిచాయని చెబుతారు.
ది హోలీ సెపల్చర్ చర్చిలోని(The Holy Sepulcher church) ఒక ప్రాంతంలో 1750 నుంచి ఈ నిచ్చెన ఉంది. ఇప్పటి వరకు ఈ నిచ్చెనను ఒక్క అంగుళం కూడా కదపడానికి ఎవరూ సాహసించలేదు. దీనిని కదిపితే వివిధ వర్గాల మధ్య వివాదం తలెత్తవచ్చనే భావనతో దీనిని ఎవరూ ఇంతవరకూ ముట్టుకోలేదట. నేటికీ చర్చిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టినా ఈ నిచ్చెనను ఈ స్థలం నుంచి కదపకపోవడం విశేషం.

Updated On 4 Nov 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story