Sunita Williams: హిమాలయాలు చాలా అందంగా కనిపించేవి.. త్వరలో భారత్‌లో పర్యటిస్తా: సునీత
Sunita Williams: హిమాలయాలు చాలా అందంగా కనిపించేవి.. త్వరలో భారత్‌లో పర్యటిస్తా: సునీత

భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత తన మొదటి భోజనం గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్ అని వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో నెలల తరబడి ఫ్రీజ్-డ్రై చేసిన, ప్యాక్ చేసిన ఆహారాన్ని తిన్న తర్వాత, విలియమ్స్ ఆ శాండ్‌విచ్ తినడంతో ఇంటి ఫుడ్ తిన్నట్లే ఉందన్నారు. భూమి మీదకు వచ్చిన తర్వాత నా భర్తను, నా కుక్కలను కౌగిలించుకున్నానని ఆమె అన్నారు. తన అంతరిక్ష ప్రయాణం గురించి చెప్తూ భారతదేశ అందాన్ని వర్ణించారు, ముఖ్యంగా హిమాలయాలపై ఎగురుతున్నప్పుడు. "భారతదేశం అద్భుతంగా ఉంది, మేము హిమాలయాల మీదుగా వెళ్ళిన ప్రతిసారీ అది అందంగా ఉండేది" అని సునీత అన్నారు. భారతదేశం తన తండ్రి మాతృభూమి కాబట్టి, ఇస్రోతో సమావేశమై తన అనుభవాలను పంచుకోవాలనే కోరిక ఉందని ఆమె అన్నారు. "నేను భారత ప్రజలను కలుస్తానని, తమ అనుభవాలను పంచుకుంటానని విలియమ్స్ అన్నారు. అంతరిక్ష నౌక సామర్థ్యాలను ప్రశంసించారు, చిన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సునీత అంగీకరించారు. "స్పేస్‌క్రాఫ్ట్ నిజంగా సామర్థ్యం కలిగి ఉంది. పరిష్కరించాల్సిన రెండు విషయాలు ఉన్నాయని.. తమ సైంటిస్టులు దానిపై చురుకుగా పని చేస్తున్నారన్నారు. కానీ ఇది గొప్ప అంతరిక్ష నౌక, ఇది ఇతర అంతరిక్ష నౌకలకు లేని చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆ విషయం విజయవంతం కావడం, ఆ కార్యక్రమంలో భాగం కావడం గౌరవం" అని ఆమె తెలిపారు.
