Costly Coin In World : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్... ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్(Costly coin) ఎక్కడుందో తెలుసా? మొగల్ చక్రవర్తి(Mughal emperor) జహంగీర్(Jahangir) కాలం నాటి 12 కిలోల బంగారు నాణేమని అంటారేమో! అది కాదు... బ్రిటన్‌లో ఇటీవల ఆవిష్కరించిన నాణేమే అత్యంత విలువైనది! దివంగత క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ కాయిన్‌ను రూపొందించారు. సుమారు నాలుగు కిలోల బంగారం(Gold), ఆరున్నర వేల కంటే ఎక్కువ వజ్రాలతో(Daimonds) ఈ నాణేన్ని తయారు చేశారు. ఈ కాయిన్ విలువ 23 మిలియన్ డాలర్లట! మన కరెన్సీలో చెప్పాలంటే 192 కోట్ల రూపాయలు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్(Costly coin) ఎక్కడుందో తెలుసా? మొగల్ చక్రవర్తి(Mughal emperor) జహంగీర్(Jahangir) కాలం నాటి 12 కిలోల బంగారు నాణేమని అంటారేమో! అది కాదు... బ్రిటన్‌లో ఇటీవల ఆవిష్కరించిన నాణేమే అత్యంత విలువైనది! దివంగత క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ కాయిన్‌ను రూపొందించారు. సుమారు నాలుగు కిలోల బంగారం(Gold), ఆరున్నర వేల కంటే ఎక్కువ వజ్రాలతో(Daimonds) ఈ నాణేన్ని తయారు చేశారు. ఈ కాయిన్ విలువ 23 మిలియన్ డాలర్లట! మన కరెన్సీలో చెప్పాలంటే 192 కోట్ల రూపాయలు. లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India Company) ఈ నాణేన్ని తయారు చేసింది. క్వీన్ ఎలిజబెత్-2(Queen Elizabeth-2) మొదటి వర్ధంతి సందర్భంగా ఈ కాయిన్‌ను విడుదల చేశారు. కామన్‌వెల్త్ దేశాలలోని హస్త కళాకారులు 16 నెలల పాటు ఎంతో శ్రమించి ఈ నాణేన్ని తయారుచేశారు. నిజానికి ఈ కాయిన్‌ను ఎంతో ఘనంగా రూపొందించానుకున్నారు. కాకపోతే వజ్రాల కొరత కారణంగా అది సాధ్యపడలేదు. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం ఉన్న ఈ నాణెం బాస్కెట్‌బాల్ అంత పరిమాణంలో ఉంది. దీనిపై దివంగత చక్రవర్తుల చిత్రాలను ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మెరీ గిల్లిక్, అర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్ బ్రాడ్లీలు తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం బరువు రెండు పౌండ్లపైగా ఉంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 1933లో అమెరికాలో ముద్రించిన డబుల్ ఈగిల్ నాణేమే ఇప్పటి వరకు అత్యంత విలువైనది. 2021 జూన్‌లో సోథెబైస్‌లో ఈ నాణేన్ని వేలం వేస్తే 18.9 మిలియన్ డాలర్లు పలికింది. అఆ గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కింది.