మన దగ్గర పండే గుమ్మడికాయ(Pumkin) సాధారణంగా ఎక్కువలో ఎక్కువ ఓ పది కిలోలు ఉంటుందంతే!

మన దగ్గర పండే గుమ్మడికాయ(Pumkin) సాధారణంగా ఎక్కువలో ఎక్కువ ఓ పది కిలోలు ఉంటుందంతే! పాతిక కిలోల గుమ్మడి కాసిందంటే ఆశ్చర్యపోతాం! అమెరికావాళ్లకు(America) మాత్రం 30 కిలోల గుమ్మడికాయ అని చెబితే నవ్వేసుకుంటారు! ఎందుకంటే అక్కడ గుమ్మడికాయలు వందలకిలోల బరువుంటాయి. వెయ్యి కిలోల గుమ్మడికాయ కూడా ఉంటుంది. బొంకర బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట వెనుకటికెవడో! అట్లా అనుకుంటున్నారేమో! నిజంగానే అంత పెద్ద గుమ్మడి కాయలు ఉంటాయక్కడ. ఇటీవల దక్షిణ శాన్‌ఫ్రాన్సిస్కోలోని హఫ్‌మూన్‌ బేలో 51 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పంప్‌కిన్‌ వేఆఫ్‌ జరిగింది. ఇందులో హార్టీకల్చర్‌ టీచర్‌ ట్రావిస్‌ జింజర్‌ అనే వ్యక్తి గెలిచాడు. ఆయన పండించిన గుమ్మడికాయ బరువు అక్షరాల 1, 121 కిలోలు. రన్నరప్‌గా నిలిచిన పండించిన గుమ్మడికాయ కంటే మూడు కిలోల బరువెక్కువ. అంటే ఆ గుమ్మడికాయ 1,118 కిలోలన్నమాట! ఇంత కష్టపడినా ప్రపంచ రికార్డు మాత్రం సాధించలేకపోయాడు 44 ఏళ్ల ట్రావిస్‌ జింజర్‌. ప్రపంచ రికార్డు ఎంతో తెలుసా? 1, 247 కిలోలు. గతంలో కూడా ట్రావిస్‌ జింజర్‌ వెయ్యి కిలోల బరువుండే గుమ్మడి పండును పండించాడు. మంచు, వర్షాల కారణంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్‌ మిస్సయ్యిందని, వచ్చేసారి గ్యారంటీగా సరికొత్త రికార్డు సాధిస్తానని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాడు జింజర్‌!

Eha Tv

Eha Tv

Next Story