Thailand Doctor : చదివింది 9వ తరగతి.. డాక్టర్‌గా చెలామణి అవుతూ వేలాది సర్జరీలు
ఈ సమాజంలో వైద్యులను(Doctors) దేవుని కంటే తక్కువగా పరిగణిస్తాం.
ఈ సమాజంలో వైద్యులను(Doctors) దేవుని కంటే తక్కువగా పరిగణిస్తాం. దేవుడు జన్మనిస్తే, వైద్యులు దానిని రక్షించే నైపుణ్యాలను కలిగి ఉంటారు.
శారీరక సమస్య ఎదురైనప్పుడు, వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఉపశమనం పొందుతామని నమ్ముతాం. కానీ ఒక్కోసారి మోసపూరిత వైద్యుల బారిన ప్రజలు పడుతున్నారు. మనం ఆస్పత్రికి వెళ్లినప్పుడు డాక్టర్‌కు ఉండే అర్హతలను, గతంలో ఎక్కడ పనిచేశారు అనే దానిపై మనకు శ్రద్ధ ఉండదు. రోగం నయమవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తాం. ఇదే బలహీనతను పెట్టుకొని నకిలీ వైద్యులు కొందరు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
థాయిలాండ్‌లో(Thailand) ఒక విచిత్రమైన కేసు బయటపడింది. 36 ఏళ్ల కిట్టి కోర్న్ సాంగ్రీ(Kitti korn sangree) అనే వ్యక్తి డాక్టర్‌గా వేషాలు(Fake doctor) వేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. కేవలం 9వ తరగతి పూర్తి చేసిన అతను సొంతంగా శస్త్రచికిత్సలు చేయడం నేర్చుకున్నాడు. గత 20 సంవత్సరాలుగా, పురుషుల ప్రైవేట్ సమస్యలకు సంబంధించిన శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నాడు. అతను ప్రతి నెలా రెండు నుండి మూడు ఆపరేషన్లు చేస్తున్నాడు. ఈ మధ్య ఒకరికి శస్త్రచికిత్స చేశాడు. ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో ఈ నకిలీ వైద్యుడి భాగోతం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోగా ఉన్న విషయం బయటడింది. తాను ఎలాంటి వైద్య విద్య చదవలేదని, కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని తెలిపారు. దీంతో పోలీసులు ఈ నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేశారు.