వరుస ఉగ్రదాడులు(Terrorist attacks) పాకిస్తాన్‌ను భయాందోళనకు గురి చేస్తున్నాయి. లేటెస్ట్‌గా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని(Punjab Provinces) మియన్వాలిలో ఉన్న వైమానికస్థావరంపై(airport) ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యం వెంటనే స్పందించి కాల్పులు జరపడంతో పెను విధ్వంసం తప్పింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు(Terrorist) హతమయ్యారని పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది.

వరుస ఉగ్రదాడులు(Terrorist attacks) పాకిస్తాన్‌ను భయాందోళనకు గురి చేస్తున్నాయి. లేటెస్ట్‌గా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని(Punjab Provinces) మియన్వాలిలో ఉన్న వైమానికస్థావరంపై(airport) ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యం వెంటనే స్పందించి కాల్పులు జరపడంతో పెను విధ్వంసం తప్పింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు(Terrorist) హతమయ్యారని పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. తెహ్రిక్‌ ఏ తాలిబిన్‌ పాకిస్తాన్‌ సంస్థతో పాకిస్తాన్‌ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల వివరణ ఒప్పందం కిందటి ఏడాదితో ముగిసింది. అప్పటి నుంచి పాక్‌లో ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుకుంది. శనివారం తెల్లవారుజామున ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి అయిదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ తెలిపింది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్‌ సైనికుడు మరణించాడని, పలువురికి గాయాలయ్యాయని వివరించింది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు(Fighter planes) ధ్వంసమయ్యాయని ప్రకటించింది. ఈ పేలుళ్లు తమ పనేనని తెహ్రిక్‌ ఏ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది.శుక్రవారం కూడా పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు చనిపోయారు.

Updated On 4 Nov 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story