Telugu population In USA : అమెరికాలో చెయ్యెత్తి జై కొడుతున్న తెలుగువారు!
వెనుకటికి ఓ జోక్ ఉండింది. టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలో అతి కష్టం మీద ఎవరెస్ట్ ఎక్కేసి జెండా పాతుతారు. పక్కనే చూస్తే ఓ మలయాళి టీ కొట్టు ఉంటుంది.
వెనుకటికి ఓ జోక్ ఉండింది. టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలో అతి కష్టం మీద ఎవరెస్ట్ ఎక్కేసి జెండా పాతుతారు. పక్కనే చూస్తే ఓ మలయాళి టీ కొట్టు ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మలయాళీలు ఉంటారన్నది సారాంశం! ఇప్పుడు మలయాళి ప్లేస్‌లో తెలుగువారిని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా తెలుగువారే ఉంటున్నారు. ముఖ్యంగా అమెరికా(America)లో అయితే గట్టిగా పాతుకుపోయారు. గత ఎనిమిదేళ్లలో తెలుగువారి జనాభా నాలుగు రెట్లు పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ అయ్యిందో లేదో అమెరికా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది యువత. డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక(america census bureau) ప్రకారం 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగువాళ్ల జనాభా ఉంటే, 2024నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకున్నది. కాలిఫోర్నియా(California)లో రెండు లక్షల మంది తెలుగువారు ఉన్నారట! టెక్సాస్(Texas) లక్షన్నర మంది, న్యూజెర్సీ(New Jersey)లో లక్షా పది వేల మంది, ఇల్లినాయిస్(Illinois)లో 83 వేల మంది, వర్జీనియా(Virginia)లో 78 వేల మంది, జార్జియా(Georgia)లో 52 వేల మంది తెలుగువాళ్లు ఉన్నారు. ఇందులో దాదాపు 10 వేల మంది హెచ్1బీ వీసా పొందారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. వీరిలో 80 శాతం మంది తమ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నవారేనని ఉత్తర అమెరికా తెలుగుసంఘం మాజీ కార్యదర్శి అశోక్ కొల్లా తెలిపారు. అక్కడికి వెళ్లినవారిలో 75 శాతం మంది స్థిరపడ్డారు. ఎక్కువగా డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్‌విల్లేలో తెలుగువారు సెటిల్ అయ్యారు. అమెరికాలోని 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉన్నది. హిందీ, గుజరాతీ భాషల కంటే తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.Telugu Speaking Population in US Grows Four-fold in 8 years