భూమికి(Earth) నూకలు చెల్లే కాలం దగ్గరలోనే ఉంది. ఇంతకాలం సకల జీవరాశులను కడుపులో పెట్టుకుని చూసుకున్న భూమాత సహనం కోల్పోయింది.

భూమికి(Earth) నూకలు చెల్లే కాలం దగ్గరలోనే ఉంది. ఇంతకాలం సకల జీవరాశులను కడుపులో పెట్టుకుని చూసుకున్న భూమాత సహనం కోల్పోయింది. వాతావరణ మార్పులు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. దీని వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు(scientist) అంటున్నారు. 2050 తర్వాత వచ్చే ఆరు వేల ఏళ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలు కావచ్చని హెచ్చరిస్తున్నారు. వచ్చే పదిహేను సంవత్సరాలలో అట్లాంటిక్‌ మెరిడినల్‌ ఓవర్‌టర్నింగ్‌ సర్క్యూలేషన్‌ (ఏఎంఓసీ) వ్యవస్థ పతనమవుతుందని, ఈ పరిణామం జీవావరణ వ్యవస్థ, మానవ సమాజాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌(Technical University of Munich), పాట్స్‌డమ్‌ వాతావరణ ప్రభావ పరిశోధన సంస్థ పరిశోధకులు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. దక్షిణార్థ గోళంలోని ఉపరితల వెచ్చని నీటిని అట్లాంటిక్‌ మెరిడినల్ ఓవర్‌టర్నింగ్‌ సర్క్యూలేషన్‌ వ్యవస్థ ఉత్తర అట్లాంటిక్‌లోని శీతల ప్రాంతాలకు పంపుతుంది. ఉప్పుగా, చల్లగా ఉండే ఈ నీరు సముద్ర అడుగు భాగంలో కదులుతూ దక్షిణదిశగా ప్రవహిస్తుంది. దక్షిణార్థ గోళం విపరీతంగా వెడెక్కకుండా, ఉత్తరార్థ గోళం గడ్డ కట్టకుండా ఇది నిరోధిస్తుంది. జీవ శక్తిని ఇచ్చే పోషకాలను సముద్ర పర్యావరణ వ్యవస్థ అంతటా వ్యాపింపచేస్తుంది. ఇప్పుడు మనుషులు ఏం చేశారంటే గ్రీన్‌ హౌస్‌ వాయువుల(Green house gases) ఉద్దారాన్ని పెంచారు. ప్రకృతిని ధ్వంసం చేశారు. దీంతో మంచుకరగడం మొదలయ్యింది. మంచు విపరీతంగా కరుగుతుండటంతో

అట్లాంటిక్‌ మెరిడినల్ ఓవర్‌టర్నింగ్‌ సర్క్యూలేషన్‌ వ్యవస్థ బలహీనమవుతున్నది. ఇది పెను విపత్తుకు దారి తీయవచ్చు. శాస్త్రవేత్తల పరిశోధనతోనైనా మనుషులు మారితే ప్రపంచం మనుగడ సాగిస్తుంది. లేదంటే అంతమవుతుంది.

Eha Tv

Eha Tv

Next Story