Taiwan Wife : పైసలిస్తేనే 'ఆ పని'.. భర్తకు భార్య కండీషన్
పైసలిస్తేనే 'ఆ పని'
ఓ భార్య ప్రవర్తనతో భర్త విసుగు చెందాడు. తన భార్య(Wife) పెట్టే వేధింపులు తాళలేక కోర్టు(Court) మెట్లు ఎక్కాడో భర్త. శృంగారం చేయాలంటే కూడా డబ్బు(Money) డిమాండ్ చేస్తోందని ఆ వ్యక్తి వాపోయాడు. అంతేకాదు మాటలు కలపాలన్న డబ్బులు అడుగుతోందని ఆవెదన చెందాడు. దీంతో బాధితుడి మనోవేదనను అర్థం చేసుకున్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. తైవాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తైవాన్‌లో(Taiwan) 2014లో హావో అనే వ్యక్తి జుయాన్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రానురాను హావో లావయ్యాడు. దీంతో అతడిని దూరం పెడుతూ వస్తోంది. హావో దగ్గరికి రావాలని ఎంత ప్రయత్నించినా ఆయన భార్య జుయాన్ దూరం దూరం జరిగేది. తనతో నెలకు ఒకసారి మాత్రమే శృంగారం(Romance) అని చెప్పింది. ఆ తర్వాత 2019 నుంచి ఆ ఒక్కసారికి కూడా నో చెప్పేసింది. నీతో శృంగారం ఇక కుదరదని భార్య తెగేసి చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. అయితే హావో కూడా గతంలో మాదిరిగా అడిగినంత డబ్బు ఇచ్చేవాడు కాదు. దీంతో ఓ ప్లాన్ వేసింది భార్య జుయాన్. తనతో సెక్స్‌లో పాల్గొనాలంటే 15 డాలర్లు చెల్లించాలని కండీషన్ పెట్టింది. అందుకు హావో ఒప్పుకోలేదు. కానీ 'ఆ ఆశ' ఉంటుంది కదా తర్వాత ఒప్పుకున్నాడు. కానీ జుయాన్ వ్యవహారం మరీ దారుణంగా తయారైంది. తనతో మాట్లాడేది కాదు, మాట్లాడేందుకు కూడా మనీ అడిగేది. చాటింగ్ ద్వారానే మాట్లాడేది. పిల్లలను పట్టించుకునేది కాదు, వంట చేయాలన్న, మాట్లాడాలన్నా ప్రతి రోజు 60 డాలర్లు చెల్లించాలని కండీషన్ పెట్టింది. తన భార్య జుయాన్ తీరు మితిమీరడంతో బంధువులను పిలిచి పంచాయితీ పెట్టాడు. అప్పుడు హావో బరువు తగ్గితేనే శృంగారం చేస్తానని చెప్పింది. బంధువులు కూడా ఎంత సర్దిచెప్పినా ఆమె తీరు మారలేదు, మాట అంతకన్నా మారలేదు. ఇక లాభంలేదనుకొని హావో నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు తలుపు తట్టాడు. కానీ ఆమె మాత్రం విడాకులకు ఒప్పుకోలేదు. విడాకులు వద్దే వద్దని కోర్టులో వాదించింది. ఇద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జి కూడా 'పురుషుడే' కావడంతో హావో బాధను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. విడాకులు ఇప్పించి అతని భార్య జుయాన్ నుంచి విముక్తి కల్పించాడు.