Taiwanese Parliament : పార్లమెంట్‌లో వీధి రౌడిల్లా కొట్టుకున్న ఎంపీలు
పార్లమెంట్‌లో(Parliament) అధికార, విపక్షాల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. పరస్పరం అరుచుకుంటారు. ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. కొన్ని సార్లు పొడియంవైపు దూసుకుపోవడాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడి వరకే చూశాం! అంతేకానీ చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఆ మహద్భాగ్యాన్ని తైవాన్ పార్లమెంట్(Taiwanese Parliament) మనకు కల్పించింది.
పార్లమెంట్‌లో(Parliament) అధికార, విపక్షాల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. పరస్పరం అరుచుకుంటారు. ఘాటుగా విమర్శలు చేసుకుంటారు. కొన్ని సార్లు పొడియంవైపు దూసుకుపోవడాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడి వరకే చూశాం! అంతేకానీ చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఆ మహద్భాగ్యాన్ని తైవాన్ పార్లమెంట్(Taiwanese Parliament) మనకు కల్పించింది. శుక్రవారంనాడు తైవాన్ పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి ఓ బిల్లును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కొన్ని సవరణలు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడానికి ఎంపీలకు(MP) ఎక్కువ అధికారులు ఉండాలని పట్టుబట్టాయి. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లులో ప్రతిపాదనలు ఉండటాన్ని తప్పుపట్టాయి. వాస్తవానికి ఈ బిల్లు ఓటింగ్‌కు రావడానికి ముందు ప్రజాప్రతినిధుల ఛాంబర్‌లోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఇక పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు మళ్లీ గొడవపడ్డారు. ఆ గొడవ ముదరడంతో ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు టేబుల్స్‌పై నుంచి దూకి స్పీకర్ స్థానం దగ్గరకు వెళ్లి అంగీలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. తోటి సభ్యులని కూడా చూడకుండా ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు ఓ సభ్యుడు ఏకంగా ఫైళ్లను తీసుకుని సభ నుంచి బయటకు పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తైవాన్ మీడియాలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మూడు రోజుల్లో తైవాన్‌లో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార ఉంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.