చైనా(China) ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇగురుపొరుగుతో సఖ్యతగా ఉండాలనే సోయి లేకుండా ప్రవర్తిస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌(Taiwan) చుట్టూ 20 యుద్ధ విమానాలను(Warplanes) మోహరించింది. కుట్రపూరిత ఆలోచనతోనే తైవాన్‌ జలసంధిలోని మధ్యస్థ రేఖను చైనా విమానాలు దాటినట్టు తైవాన్‌ అధికారులు అంటున్నారు.

చైనా(China) ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇగురుపొరుగుతో సఖ్యతగా ఉండాలనే సోయి లేకుండా ప్రవర్తిస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌(Taiwan) చుట్టూ 20 యుద్ధ విమానాలను(Warplanes) మోహరించింది. కుట్రపూరిత ఆలోచనతోనే తైవాన్‌ జలసంధిలోని మధ్యస్థ రేఖను చైనా విమానాలు దాటినట్టు తైవాన్‌ అధికారులు అంటున్నారు. చైనాకు తమదేశానికి మధ్యలో ఉండే జలసంధిలో చైనాకు చెందిన 20 యుద్ధ విమానాలు రెండు దేశాలను వేరే చేసే మధ్యస్థ రేఖను దాటి తమ దేశ ఆగ్నేయ నైరుతి వాయు రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయని చెబుతున్నారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఇలాంటి ట్రైనింగ్‌ మిషన్లను చైనా నిర్వహిస్తోందని ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల కిందట అమెరికా, కెనడాకు చెందిన రెండు నౌకలు తైవాన్‌ జలసంధి దగ్గర తిరుగుతూ తైవాన్‌కు అండగా నిలిచే ప్రయత్నం చేశాయని, ఇది చూసి చైనా దళాలు అప్రమత్తమయ్యాయని తైపే రక్షణ శాఖ పేర్కొంది.ఈ వారంలోనే తైవాన్‌ చుట్టూ తిరుగుతున్న 68 విమానాలను 10 యుద్ధ నౌకలను గుర్తించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated On 17 Sep 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story