భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌(sunita williams) భూమ్మీదకు ఇప్పట్లో వచ్చేట్టగా లేదు.

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌(sunita williams) భూమ్మీదకు ఇప్పట్లో వచ్చేట్టగా లేదు. ఆమె ఇక్కడికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టేట్టుగా ఉంది. నాసా(NASA) చెప్పినదాని ప్రకారం సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బారీ విల్‌మోర్‌ను ఫిబ్రవరిలో భూమ్మీదకు తీసుకువస్తామని, అప్పటి వరకు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటారు. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు వచ్చినందున, దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా భావించింది. అందుకే వ్యోమగాములు లేకుండా ఆటోపైలట్‌ పద్ధతిలో దీనిని తిరిగి భూమి మీదకు తీసుకురావాలని అనుకుంటోంది. ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌ జూన్‌ 5వ తేదీన అంతరిక్షానికి బయలుదేరారు. వీరు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్‌ కావడంతో ప్రోపల్షన్‌ వ్యవస్థలో లోపాలు, వాల్వ్‌లో సమస్యలు వచ్చాయి. అదృష్టం బాగుండబట్టి జూన్‌ 6వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారిద్దరు సురక్షితంగా చేరుకున్నారు. భూమి నుంచి ఐఎస్‌ఎస్‌కి మనుషులను తీసుకెళ్లి, తీసుకురావడం కోసం బోయింగ్‌ కంపెనీ స్టార్‌లైనర్‌ అనే వ్యోమనౌకను తయారుచేసింది. దీని ద్వారా అంతరిక్ష కేంద్రానికి వాణిజ్య ప్రయాణాలు చేపట్టాలనేది బోయింగ్‌ సంస్థ ఆశయం. స్టార్‌లైనర్‌కు ఈ సామర్థ్యాలు ఉన్నాయని ప్రదర్శించేందుకు సునీతా, విల్‌మోర్‌ను అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఇప్పుడు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో బోయింగ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు అందులో ప్రయాణించడానికి ప్రజలు జంకుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story