ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంఉన్న ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు అక్కడి నుంచే రాబోయే నవంబర్ ఎన్నికలలో ఓటు వేయనున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంఉన్న ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు అక్కడి నుంచే రాబోయే నవంబర్ ఎన్నికలలో ఓటు వేయనున్నారు. ఇందుకోసం అధికారులను విల్మోర్‌ సంప్రదించారు. ఎన్నికల్లో పాల్గొనడం ఆ దేశ పౌరులుగా తమ బాధ్యత అని విల్మోర్(Butch Wilmore), సునీతా విలియమ్స్‌(Sunita Williams) ప్రకటించారు. ఇందుకోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పాస్‌వర్డ్‌తో కూడిన పీడీఎఫ్‌ను అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు అధికారులు పంపించనున్నారు. అందులో ఉన్న అంశాలను ఫిలప్‌ చేసి పీడీఎఫ్‌ను తిరిగి అధికారులకు పంపిస్తారు. అమెరికా ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా వీరిద్దరి ఓట్లను కూడా లెక్కించనున్నారు.అంతరిక్షం నుంచి ఓటు వేయడం ఇదేం కొత్తేమీ కాదు. 1997లో టెక్సాస్ చట్టం వ్యోమగాములను కక్ష్య నుంచి ఓటు వేయడానికి అనుమతించింది., డేవిడ్ వోల్ఫ్ 1997లో మీర్ స్పేస్ స్టేషన్‌లో అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ వ్యోమగామి. NASA వ్యోమగామి కేట్ రూబిన్స్ 2020 ఎన్నికల సమయంలో అంతరిక్షం నుంచి తన ఓటును వినియోగించుకున్నారు. వచ్చే నవంబర్‌లో ఎన్నికలు ఉన్నందున, విల్మోర్, సునీతా విలియమ్స్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేనందున అక్కడి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story