Earthquake in Indonesia : ఇండోనేషియా లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవికి పశ్చిమాన మంగళవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ప్రకారం.. సుమారు రెండు గంటలపాటు సునామీ హెచ్చరిక జారీ చేయబడింది.
ఇండోనేషియా(Indonesia)లో మరోసారి భూకంపం(Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవి(Sumatra Island)కి పశ్చిమాన మంగళవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ(Indonesia Geophysics Agency) ప్రకారం.. సుమారు రెండు గంటలపాటు సునామీ(Tsunami)హెచ్చరిక జారీ చేయబడింది. అధికారులు తక్షణమే తీరం నుండి ప్రభావిత ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేయించారు. అయితే.. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) భూకంప తీవ్రతను 6.9గా పేర్కొంది. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 84 కిలోమీటర్ల (52.2 మైళ్ళు) లోతులో నిక్షిప్తమై ఉన్నట్లు పేర్కొంది.
సుమత్రా పశ్చిమ తీరంలో భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ద్వీపాల నుండి అధికారులు డేటాను సేకరిస్తున్నారని ఇండోనేషియా విపత్తు ఉపశమన ఏజెన్సీ, ఇండోనేషియా వాతావరణ శాఖ ప్రతినిధి అబ్దుల్ ముహ్రి(Abdul Muhari) తెలిపారు. పడాంగ్‌లో ఉన్న అబ్దుల్ ముహ్రి మాట్లాడుతూ.. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. కొంతమంది బీచ్‌లకు దూరంగా వెళ్లారని చెప్పారు. "ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. కొందరు భయాందోళనలకు గురయ్యారు. కానీ నియంత్రణలో ఉన్నారు. ప్రస్తుతం వారిలో కొందరిని సముద్రం నుంచి దూరంగా ఉంచినట్లు" పేర్కొన్నారు.
స్థానిక టీవీలలో కొంతమంది పడాంగ్ నివాసితులు బైక్‌లపై, కాలినడకన ఎత్తైన ప్రదేశాలకు వెళ్లడాన్ని చూపించారు. స్థానిక అధికారి నోవియాండ్రి స్థానిక టీవీ వన్‌తో మాట్లాడుతూ.. సైబర్ట్ ద్వీపంలోని ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు. సునామీ హెచ్చరికను ఎత్తివేసే వరకు ప్రజలు దూరంగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు.
అంతకుముందు ఆదివారం కూడా ఇండోనేషియాలో బలమైన భూకంపం సంభవించింది. యూఎంఎస్‌సీ ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కెపులువాన్ బటులో రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి ప్రకంపన తీవ్రత 6.1 కాగా.. కొన్ని గంటల తర్వాత 5.8 తీవ్రతతో మరోమారు భూమి కంపించింది.