చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూకంప తీవ్రత రికార్టు స్కేలుపై 7.2గా నమోదైంది. మొన్న సంభవించిన సిరియా, టర్కీలో భూకంపం విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే చైనా, తజికిస్థాన్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. . చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ ఉయ్‌గర్ అటానమస్ రీజియన్‌లో ఈ ఈ భూకంపాన్ని ధృవీకరించింది . . తజికిస్తాన్‌లో భూకంపం సంభవించిన ప్రాంతం చుట్టూ భారీ పామీర్ పర్వత శిఖరాలు […]

చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ భూకంప తీవ్రత రికార్టు స్కేలుపై 7.2గా నమోదైంది. మొన్న సంభవించిన సిరియా, టర్కీలో భూకంపం విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే చైనా, తజికిస్థాన్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. . చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ ఉయ్‌గర్ అటానమస్ రీజియన్‌లో ఈ ఈ భూకంపాన్ని ధృవీకరించింది . .

తజికిస్తాన్‌లో భూకంపం సంభవించిన ప్రాంతం చుట్టూ భారీ పామీర్ పర్వత శిఖరాలు ఉన్నట్లు యూఎస్‌జీఎస్ అంచనా వేసింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడవచ్చని చెబుతోంది. అయితే ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటివరకు చైనా పరిస్థితిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు.

మరోవైపు మన దేశం లోనూ భారీ భూకంపాలు సంభవిస్తాయని జియోఫిజికల్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణచందర్ రావు హెచ్చరించారు ..అయితే మరుసటి రోజే ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూమి కంపించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 సమయంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు .

Updated On 24 Feb 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story