Chinese Woman : కడుపులో 8 నెలల శిశువు.. ప్రసవానికి ముందు వరకు గ్రహించని మహిళ..!
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ కొన్నేళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తోంది.
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ కొన్నేళ్లుగా సంతానం కోసం ప్రయత్నిస్తోంది. చైనా మహిళ గాంగ్, తన భర్తతో కలిసి, చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నారు. IVF చికిత్సను తీసుకున్నా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. బిడ్డను కనాలంటే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అయితే అనుకోకుండా తనకు కొంత అస్వస్థత రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లగా ఆమెకు బీపీ పెరిగినట్లు గుర్తించారు. అల్ట్రాసౌండ్ చేయగా గర్భంలో శిశువు ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిదిన్నర నెలల రెండు కిలోల శిశువు ఉందని వైద్యులు చెప్పడంతో ఆ జంట ఆశ్చర్యపోయింది. గతేడాది డిసెంబరు ప్రారంభంలో, గాంగ్ చేతుల్లో తిమ్మిరి వచ్చింది. దీంతో ఆమె చెకప్ సమయంలో, ఆమె రక్తపోటు భయంకరంగా ఎక్కువగా ఉందని డాక్టర్ గమనించారు. డాక్టర్ మరింత పరిశోధించడానికి అల్ట్రాసౌండ్‌ను సూచించాడు.
దాదాపు ఎనిమిది నెలల వరకు ఆమె కడుపులో బిడ్డ పెరగడం గమనించకపోవడం ఏంటని ఒకింత ఆశ్చర్యపోతున్నారు.