అమెరికాలో ఓ ఉద్యోగికి బంపరాఫర్‌ తగిలింది. ఉద్యోగంలోకి తీసేసిన యాజమాన్యం చచ్చినట్టు ఆమెకు 210 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. జరిగిందేమిటంటే.. అమెరికాలోని న్యూజెర్సీలో షానన్‌ ఫిలిప్స్‌ అనే మహిళ పని చేస్తున్న ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌ షాపులోకి ఇద్దరు నల్ల జాతీయులు వచ్చారు. కాసేపయ్యాక వారిలో ఒకరు షాపులోని వాష్‌రూమ్‌ను వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనలేదు కాబట్టి సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. అయితే తాము బిజినెస్‌ పని మీద ఒకరి కోసం ఎదురుచూస్తున్నామని ఆ ఇద్దరూ నల్లజాతీయులు చెప్పారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న షాపు సిబ్బంది వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆ ఇద్దరిని కోరారు. అందుకు వారు నిరాకరించారు.

అమెరికాలో ఓ ఉద్యోగికి బంపరాఫర్‌ తగిలింది. ఉద్యోగంలోకి తీసేసిన యాజమాన్యం చచ్చినట్టు ఆమెకు 210 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. జరిగిందేమిటంటే.. అమెరికాలోని న్యూజెర్సీలో షానన్‌ ఫిలిప్స్‌ అనే మహిళ పని చేస్తున్న ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌ (Starbucks ) షాపులోకి ఇద్దరు నల్ల జాతీయులు వచ్చారు. కాసేపయ్యాక వారిలో ఒకరు షాపులోని వాష్‌రూమ్‌ను వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనలేదు కాబట్టి సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు. అయితే తాము బిజినెస్‌ పని మీద ఒకరి కోసం ఎదురుచూస్తున్నామని ఆ ఇద్దరూ నల్లజాతీయులు చెప్పారు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న షాపు సిబ్బంది వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆ ఇద్దరిని కోరారు. అందుకు వారు నిరాకరించారు. ఆంతో సిబ్బంది పోలీసులకు కబురుపెట్టారు. పోలీసులు వచ్చి వారిని బలవంతంగా అక్కడ్నుంచి తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఆందోళనలను ఊపందుకున్నాయి. వాటిని సద్దుమణిగేలా చేయడానికి సంస్థ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా రీజినల్ మేనేజర్‌ అయిన షానన్‌ ఫిలిప్స్‌ను ఉద్యోగంలోంచి తొలగించింది. దుకాణ మేనేజర్‌ను మాత్రం ఉద్యోగంలో ఉంచింది. రీజినల్ మేనేజర్‌ షానన్‌ ఫిలిప్స్‌ ఏమో శ్వేత జాతీయురాలు.. మేనేజరేమో నల్ల జాతీయుడు. శ్వేత జాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి తనను ఉద్యోగంలోంచి తీసేశారంటూ ఆమె 2019లో స్టార్‌బక్స్‌పై కేసు పెట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్‌ జ్యూరీ స్టార్‌ బక్స్‌ సంస్థకు 25.6 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. ఉద్యోగంలోకి తొలగించిన ఫిలిప్స్‌కు 25.6 మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఫెడరల్‌ జ్యూరీ సంస్థను ఆదేశించింది.

Updated On 16 Jun 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story