యెమన్‌(Yemen)దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక సాయం పంపిణీలో తొక్కిసలాట జరిగి 85మందికిపైగా చనిపోయారు. రాజధాని సనా(Sana) లోని పాతబస్తీలో ఈ దుర్ఘటన జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రంజాన్‌(Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ వ్యాపారవేత్త పేదలకు ఆర్ధిక సాయం అందిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఓ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు.

యెమన్‌(Yemen)దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక సాయం పంపిణీలో తొక్కిసలాట జరిగి 85మందికిపైగా చనిపోయారు. రాజధాని సనా(Sana) లోని పాతబస్తీలో ఈ దుర్ఘటన జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రంజాన్‌(Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ వ్యాపారవేత్త పేదలకు ఆర్ధిక సాయం అందిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఓ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. వారిని అదుపులో పెట్టేందుకు గాలిలో కాల్పలు జరిపారు. బులెట్‌ కరెంట్‌ వైర్‌కు తగలడంతో నిప్పులు చెలరేగాయి. దాంతో జనంలో భయాందోళన మొదలయ్యింది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.
ఈ సంఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated On 19 April 2023 11:27 PM GMT
Ehatv

Ehatv

Next Story