శ్రీలంక(Sri lanka) టూర్‌కు వెళుతున్న ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి లంక ప్రభుత్వం ఉచిత వీసాలను(Visa) జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాక మంత్రి ఆమోదం తెలిపారు. భార‌త్‌, చైనా(China), ర‌ష్యా(Russia), మ‌లేషియా(Malesiya), జ‌పాన్‌(Japan), ఇండోనేయిష‌యా(Indonesia), థాయ్‌లాండ్(Thailand) పౌరుల‌కు ఉచితం వీసాలు జారీ ప్ర‌తిపాద‌న‌ను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది.

శ్రీలంక(Sri lanka) టూర్‌కు వెళుతున్న ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి లంక ప్రభుత్వం ఉచిత వీసాలను(Visa) జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాక మంత్రి ఆమోదం తెలిపారు. భార‌త్‌, చైనా(China), ర‌ష్యా(Russia), మ‌లేషియా(Malesiya), జ‌పాన్‌(Japan), ఇండోనేయిష‌యా(Indonesia), థాయ్‌లాండ్(Thailand) పౌరుల‌కు ఉచితం వీసాలు జారీ ప్ర‌తిపాద‌న‌ను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్రమేమిటంటే ఈ లిస్టులో అమెరికా లేదు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్య‌క్ర‌మం త‌క్ష‌ణ‌మే అమలులోకి వస్తుందని, మార్చి 31 వరకూ ఇది కొన‌సాగ‌నుంద‌ని విదేశాంగ‌మంత్రి అలీ స‌బ్రీ తెలిపారు. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని శ్రీలంక భావిస్తోంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే టూరిస్టుల సంఖ్య 50 లక్షలకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు శ్రీలంక విదేశాంగమంత్రి తెలిపారు. శ్రీలంకకు టూరిజం(Srilanka Tourism) ప్రధాన ఆదాయ వనరు. ఈ క్ర‌మంలో ఆ దేశం ప్ర‌క‌టించిన ఉచిత వీసాల జాబితాలో మ‌లేషియా, జ‌పాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు ప‌ర్యాట‌కుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావ‌డం విశేషం. శ్రీలంక నిర్ణ‌యంతో ఆయా దేశాల‌కు చెందిన‌ ప‌ర్యాట‌కుల‌కు వీసా ఖ‌ర్చు, స‌మ‌యం త‌గ్గ‌నుంది.

Updated On 24 Oct 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story