ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌(Monkey pox) వేగంగా విస్తరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌(Monkey pox) వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికాలో(Africa)ని 13 దేశాలలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ(WHO)ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగో(Congo)లో ఈ వ్యాధి క్లాడ్‌I తో ప్రారంభమై.. క్లాడ్‌Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు.మొత్తం కేసులు, మరణాలలో 96 శాతానికి పైగా కాంగోలోనే ఉన్నాయి. కాంగోలో 70 శాతం కేసులు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు లైంగిక సంపర్కం వల్లనే ఈ వైరస్‌ సోకుతుందని అనుకున్నారు కానీ సన్నిహిత పరిచయం ఉన్న వారి నుంచి కూడా సంక్రమిస్తున్నదని ఇప్పుడు తెలిసింది. ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత మంకీఫాక్స్‌ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.

ehatv

ehatv

Next Story