చంద్రుడి మీద వెంచర్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టిన వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది జాబిల్లిపై పాట్లు కొన్నారు కూడా!

చంద్రుడి మీద వెంచర్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టిన వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది జాబిల్లిపై పాట్లు కొన్నారు కూడా! చందమామ అయ్యాక కుజ గ్రహంపై కూడా రియల్‌ ఎస్టేట్‌ మొదలు పెట్టారు. మార్స్‌లో జాగాలు కొన్ని రిజిస్టర్‌ చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు స్వర్గం వంతు వచ్చింది. ప్రస్తుతం స్వర్గంలోనూ రియల్‌ ఎస్టేట్‌ నడుస్తోంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అర్జెంట్‌గా ఓ ప్లాట్‌ కొనుక్కోండి. ఎందుకంటే ఆలస్యం చేస్తే రేట్లు పెరిగినా పెరగొచ్చు. ఇంతకీ ఈ రియల్ ఎస్టేట్‌ వ్యాపారం ఎవరు చేస్తున్నారంటే ఓSpanish River Church Pastor Says Biggest Real Estate Deal On Planet మన కరెన్సీలో ఎనిమిది వేల రూపాయలకు ఓ చదరపు మీటర్‌ వస్తుంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌, ఓ టిక్‌టాక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అన్నట్టు స్వర్గంలో నివాసం ఉండేందుకు ఇప్పటికే దేవుడితో చర్చలు కూడా పూర్తయ్యాయట. 2017లో ఓసారి దేవుడితో మీటింగ్‌లో ఈ అంశం ప్రస్తావనకు రాగా, రియల్‌ ఎస్టేట్‌కు దేవుడు అనుమతి కూడా ఇచ్చాడట. ఈ విషయాలను ఆ చర్చి పాస్టరే స్వయంగా చెబుతున్నాడు. దేవుడితో పాటు, దేవుడి ఇంటికి పక్కన ప్లాట్‌కు మాత్రం ఖరీదెక్కువ. బ్రోచర్‌ను మాత్రం అందంగా తయారు చేశారు. స్వర్గంలో ప్లాట్లు కొనటానికి నగదే చెల్లించాల్సిన పనిలేదు. వీసా, జీపే, యాపిల్‌పే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, మాస్టర్‌ కార్డు, మాస్ట్రో కార్డు సదుపాయాలు కూడా ఉన్నాయి. . పైగా వాయిదాల పద్దతిలో కూడా ప్లాట్లు తీసుకోవచ్చు. . ఈ ఆఫర్‌ నమ్మి ఇప్పటికే చాలా మంది జాగాలు కొనేస్తున్నారట. లాస్టియర్‌ దక్షిణాఫ్రికాలో ఓ పాస్టర్‌ కూడా తన ఫాలోవర్ల భూములు, ఆస్తులు అమ్మించి.. స్వర్గంలో జాగా కొనిపించాడు. !

Eha Tv

Eha Tv

Next Story