Spain Rituals : పసిపిల్లలకు ప్రేతాత్మల నుంచి రక్షణ కోసం బేబీ జంపింగ్
దేవుడు, దెయ్యం(Ghost) అనే నమ్మకాలు మనకే కాదు, ప్రపంచమంతా ఉన్నాయి. దైవాన్ని ప్రార్థిస్తారు. దెయ్యాన్ని ద్వేషిస్తారు. దెయ్యాలను తరిమివేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దెయ్యమంటే చెడు. దుష్టశక్తి అన్నమాట. ఆ దుష్టశక్తులను తరిమికొట్టడానికి మనం ఎన్నెన్నో చేస్తాం. చంటిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండేందుకు బుగ్గన నల్ల చుక్కపెడతాం.
దేవుడు, దెయ్యం(Ghost) అనే నమ్మకాలు మనకే కాదు, ప్రపంచమంతా ఉన్నాయి. దైవాన్ని ప్రార్థిస్తారు. దెయ్యాన్ని ద్వేషిస్తారు. దెయ్యాలను తరిమివేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. దెయ్యమంటే చెడు. దుష్టశక్తి అన్నమాట. ఆ దుష్టశక్తులను తరిమికొట్టడానికి మనం ఎన్నెన్నో చేస్తాం. చంటిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండేందుకు బుగ్గన నల్ల చుక్కపెడతాం. తావీదులు కడతాం. చాలా మంది వీటిని మూఢనమ్మకాలుగా(Superstitious) తీసిపారేస్తారు. కానీ స్పెయిన్‌లో(Spain) వీటిని మించిన ఓ సంప్రదాయం(Ritual) ఉంది. ఆ దేశంలోని ఓ గ్రామం ప్రజలు పసిపిల్లలకు(New Born Babies) ఎలాంటి హానీ కలగకూడదని ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. 16వ శతాబ్దం నుంచి ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటివారంలో నిర్వహించే ఈ ఫెస్టివల్ పేరు బేబీ జంపింగ్.
సైతాన్ వేషాన్ని ధరించిన వ్యక్తిని కొలాచోగా(Kolachoga) పిలుచుకుంటారు. ఆ వ్యక్తి వీధుల్లో పరుపులపై పడుకోబెట్టిన పిల్లల మీదుగా దూకుతాడు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ప్రేతాత్మల నుంచి రక్షణ కలుగుతుందనేది వారి విశ్వాసం. ఏడాదిలోపు పసివాళ్లను మాత్రమే ఇలా పడుకోబెడతారు. స్పెయిన్‌లోని క్యాస్ర్టిల్లో డి ముర్సియా గ్రామంలో జరుగుతుందీ ఫెస్టివల్. సైతాన్ వేషాన్ని వేసుకునే వ్యక్తి పసుపు , ఎరుపు దుస్తులను ధరిస్తాడు.. పిల్లల నుంచి దూకడం వల్ల వారిలోని దుష్టశక్తులు పారిపోతాయట! 1620 నుంచి ఈ తంతును నిర్వహిస్తున్నారు ప్రజలు. పిల్లలకు ఎలాంటి పీడలు రాకూడదనే సదుద్దేశంతోనే ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆచారాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆచారం ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదుగానీ నాలుగు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది.