Dog Meat : కుక్క మాంసం తింటే మూడేళ్ల జైలుశిక్ష... ఎక్కడో తెలుసా?
అక్కడ పొరపాటున కూడా కుక్కమాంసం తినకూడదు. ఖర్మకాలి తిన్నారే అనుకోండి మూడేళ్లు చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇది మన దగ్గర కాదులేండి. దక్షిణ కొరియాలో.. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. కుక్కమాంసం వినియోగాన్ని నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది.
అక్కడ పొరపాటున కూడా కుక్కమాంసం తినకూడదు. ఖర్మకాలి తిన్నారే అనుకోండి మూడేళ్లు చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇది మన దగ్గర కాదులేండి. దక్షిణ కొరియాలో.. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. కుక్కమాంసం వినియోగాన్ని నిషేధిస్తూ బిల్లును ఆమోదించింది. జాతీయ అసెంబ్లీలో 208-0 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. శతాబ్దాలుగా అక్కడ కుక్క మాంసం వినియోగంలో ఉంది. కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటారక్కడ! అయితే ఇక నుంచి ఎవరూ తినడానికి వీల్లేదు. పార్లమెంట్ ఆమోదించిన తీర్మానంపై అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సంతకం చేయనున్నారు. కొత్త బిల్లు ప్రకారం కుక్కల్ని చంపడం, బ్రీడింగ్ చేయడం, ట్రేడింగ్, అమ్మకాలు ఇవన్నీ అక్రమాలు కాబోతున్నాయి. కాకపోతే 2027 నాటికి బిల్లు అమలులోకి వస్తుంది. అప్పట్నుంచి ఎవరైనా కుక్క మాంసాన్ని వినియోగిస్తే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. నిజానికి ఆ దేశ ప్రజలే కుక్క మాంసాన్ని తినడం బాగా తగ్గించారు.