Kim Jong Un : నిద్రలేమి జబ్బుతో బాధపడుతునన కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆరోగ్య పరిస్థితిపై వచ్చినన్ని కథనాలు మరే అధ్యక్షుడిపై వచ్చి ఉండకపోవచ్చు. అమెరికా మీడియా నిరంతరం కిమ్‌పై కథనాలు వండి వారుస్తుంటుంది. ఇప్పుడు తాజాగా ఏమి రాసిందంటే కిమ్ నిద్రలేని సమస్యతో బాధపడుతున్నాడట. ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరిందట!
ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఆరోగ్య పరిస్థితిపై వచ్చినన్ని కథనాలు మరే అధ్యక్షుడిపై వచ్చి ఉండకపోవచ్చు. అమెరికా మీడియా నిరంతరం కిమ్‌పై కథనాలు వండి వారుస్తుంటుంది. ఇప్పుడు తాజాగా ఏమి రాసిందంటే కిమ్ నిద్రలేని సమస్యతో బాధపడుతున్నాడట. ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరిందట! ఎప్పుడో ఒకప్పుడు ఆయన ప్రాణాలు టప్పుమని పోతాయట! ఇలాగని బ్లూమ్‌బర్గ్(BloomBerg), న్యూయార్క్ టైమ్స్(NewYork Times) వంటి ప్రముఖ మీడియాలలో వచ్చాయి. దక్షిణ కొరియా(South Korea) నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(Insomnia) అంటే నిద్రలేమికి సంబందించిన విదేశీ మెడికల్ సమాచారాన్ని, ప్రత్యేకంగా జోల్పిడెమ్ వంటి మందులకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో తెగ వెతుకుతున్నారట.
నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ రూపొందించిన నివేదిక వివరాలను దక్షిణ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సెక్రటరీ యూ సాంగ్ బూమ్ మీడియాకు తెలిపారు. 'ఇన్సోమ్నియా అనే జబ్బు ఉత్తర కొరియాను ఆందోళనకు గురి చేస్తోంది. నార్త్ కొరియా అధినేత ఆ సమస్యతో బాధపడుతున్నట్టు మాకు తెలిసింది. దాని చికిత్స, మందుల సమాచారం కోసం అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వైద్య విధానాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది' అని యూ సాంగ్ బూమ్ చెప్పుకొచ్చారు. ' కిమ్ జోంగ్ ఉన్ లేటెస్ట్ ఫోటోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మరోసారి లావైనట్టు తెలిసింది' అని బూమ్ అన్నారు. వీటితో పాటు విదేశాల నుంచి మాల్బరో, డన్‌హిల్ వంటి విదేశీ బ్రాండ్ సిగరెట్లను, మద్యంతో పాటుగా తినే స్నాక్స్‌ను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని బూమ్ తెలిపారు.
'విపరీతంగా మద్యాన్ని పుచ్చుకోవడం, విరామం లేకుండా సిగరెట్లు తాగడం వల్ల కిమ్ ఆరోగ్యం రోజురోజుకీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది. సుమారు 140 కిలోల బరువుకు ఆయన చేరుకున్నాడు. దీనికి తోడు నిద్రలేమి ఆయనను వేధిస్తున్నది. మే 16వ తేదీన ఓ కార్యక్రమానికి హాజరైన కిమ్ ఫోటోను పరికిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. . అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్‌లాంటి మందులను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది' అని నివేదిక సారాంశాన్ని యూ సాంగ్ బూబ్ వివరించారు. ఇక పోతే ఉత్తర కొరియాలో ఆహార కొరత తారస్థాయికి చేరింది. ఫలితంగా ఆహార ధాన్యాల రేట్లు విపరీతంగా పెరిగాయి. కిమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దిగజారిపోతున్నదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి.