సౌతాఫ్రికాలో ఒక శునకం తన యజమాని ప్రాణాలని కాపాడింది .ఒక్కరోజు కాదు ఏకంగా మూడు రోజుల పాటు అతనికి ప్రాణాపాయం ఉన్న విషయం తెలిసిన దగ్గర నుండి అతని వెంటే నీడలా వెంబడించింది. అతను ఇదంతా గమనిస్తూనే ఉన్న కారణం మాత్రం గ్రహించలేకపోయాడు. చివరి రోజు అసలు నిజం తెలుసుకొన్న యజమాని .

అత్యంత విషపూరితమైన పాము నుండి యజమాని ప్రాణాలని కాపాడింది ఒక శునకం. అన్ని ప్రాణిజాతుల్లో కుక్క అత్యంత విశ్వాసం గల జంతువుగా మనందరికీ తెలుసు. ఒక్కసారి అన్నం పెట్టి ఆదరిస్తే చాలు వీధి కుక్కైనా మన వెనకాలే వస్తుంటాయి. అలాంటి ప్రేమ విశ్వాసాన్ని కలిగిన కుక్కలు పెంచుకున్నపుడు అవి యజమానికి కంటి రెప్పలా కాపలాకాస్తూ ఉంటాయి . ఇది మన అందరికి తెల్సిన విషయమే.

సౌతాఫ్రికాలో ఒక శునకం తన యజమాని ప్రాణాలని కాపాడింది .ఒక్కరోజు కాదు ఏకంగా మూడు రోజుల పాటు అతనికి ప్రాణాపాయం ఉన్న విషయం తెలిసిన దగ్గర నుండి అతని వెంటే నీడలా వెంబడించింది. అతను ఇదంతా గమనిస్తూనే ఉన్న కారణం మాత్రం గ్రహించలేకపోయాడు. చివరి రోజు అసలు నిజం తెలుసుకొన్న యజమాని .ఆ కుక్కను హత్తుకొని నీ ఋణం తీర్చుకోలేనిది అంటూ ముద్దాడట !

అసలు ఎం జరిగింది ?కుక్క ఆ యజమానిని ఎలా కాపాడింది అంటే .. 3 రోజుల క్రితం ఒక పాము తన యజమాని నిద్రించే మంచం కిందకు చేరటం గమనించిన శునకం తన యజమాని నిద్రలేచి మంచం దిగిన ప్రతి సారి అరవటం మొదలు పెట్టేది .కుక్క అరుపు విని పాము లోపలి కి వెళ్లిపోయేది. కుక్క మంచం కిందకు చూస్తూ ఒక్కటే అరవటం చూస్తున్నయజమాని 3 వ రోజు అనుమానంతో మంచం కిందకి చూడటంతో ఒక్కసారిగా భయపడ్డాడు. సౌతాఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన నల్ల త్రాచు (black mamba )ని చూసి అతని గుండె ఝల్లు మంది. పాములు పెట్టె వారికీ సమాచారం ఇవ్వగా వారు దాన్ని పట్టుకొని తీసుకువెళ్లి అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది . ఆలా ఆ కుక్క తన యజమాని ప్రాణాలు కాపాడింది .

Updated On 11 March 2023 4:50 AM GMT
Ehatv

Ehatv

Next Story