Netherlands : 18 నెలలపాటు తండ్రి శవాన్ని ఫ్రీజర్‌లో దాచిపెట్టిన కొడుకు
నెదర్లాండ్స్(Netherlands) రాజధాని అమ్‌స్టర్‌డ్యామ్(Amsterdam)లో వయోవృద్ధుడైన తన తండ్రి శవాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచిపెట్టాడో వృద్ధుడు. వయోవృద్ధుడి వయసు 101 ఏళ్లు అయితే, వృద్ధుడి వయసు 82 ఏళ్లు. విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాయి. ఎలాగోలా విషయం పోలీసులకు తెలిసింది. తండ్రి మృతదేహాన్ని ఇన్నాళ్లుగా ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు ఆయనను అడిగారు.
నెదర్లాండ్స్(Netherlands) రాజధాని అమ్‌స్టర్‌డ్యామ్(Amsterdam)లో వయోవృద్ధుడైన తన తండ్రి శవాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచిపెట్టాడో వృద్ధుడు. వయోవృద్ధుడి వయసు 101 ఏళ్లు అయితే, వృద్ధుడి వయసు 82 ఏళ్లు. విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాయి. ఎలాగోలా విషయం పోలీసులకు తెలిసింది. తండ్రి మృతదేహాన్ని ఇన్నాళ్లుగా ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు ఆయనను అడిగారు. దానికాయన చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. ఆయన తండ్రిని చాలా మిస్ అవుతున్నాడట. ఆయనతో మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాడట. అందుకే శవాన్ని ఫ్రీజర్‌లో ఉంచి ప్రతి రోజూ తండ్రితో మాట్లాడుతున్నాడట. ఇలా చేస్తున్నందుకు తనలో మనో ధైర్యం పెరుగుతోందని చెప్పాడు. పోలీసులకు ఉండే సహజసిద్ధమైన అనుమానంతో తండ్రి ఎలా చనిపోయాడన్నదానిపై దర్యాప్తు చేశారు. అయితే తండ్రి మృతికి కొడుకుకు ఎలాంటి సంబంధ లేదని తేలింది. చాలా ఏళ్లుగా ట్యూమర్(Tumor)తో బాధపడుతున్నాడని, తరచూ ఆసుపత్రికి కూడా వెళ్లి వస్తుంటారని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ఫ్లాట్‌కు వచ్చి చెక్ చేసినట్టు తెలిపారు. కొడుకు వయసు కూడా 80 ఏళ్లపైన ఉండటంతో సరిగ్గా నడవలేకపోతున్నాడు. సరిగ్గా సర్దుకోకపోవడంతో ఇల్లంతా చెల్లాచెదురుగా వుంది. వారంలో ఇల్లు సర్దుకోవాలని కొడుకుకు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు పోలీసులు. వారం రోజుల గడువు అయితే ఇచ్చారు కానీ పనులు చేసుకునే స్థితిలో కొడుకు లేడు. ఇతరుల సాయం తీసుకోవాల్సిందే! 2015లో కూడా నెదర్లాండ్‌లో ఓ వ్యక్తి తన తల్లి శవాన్ని రెండేళ్ల పాటు ఫ్రిజ్‌లోనే భద్రపరిచాడు. ఆమెకు వచ్చే పెన్షన్ కోసం ఆ పని చేశాడట. పోలీసులకు చిక్కడంతో వారు అతడికి 36 లక్షల రూపాయల ఫైన్ వేశారు.