Operation Ajay : ఢిల్లీకి చేరుకున్న ఆరో విమానం.. నేపాల్ పౌరులు కూడా ఉన్నారు..!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అపరేషన్ అజయ్(Operation Ajay) కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇద్దరు నేపాల్(Nepal) పౌరులతో సహా 143 మంది ప్రత్యేక విమానంలో ఆదివారం భారతదేశానికి తిరిగి వచ్చారు.
ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అపరేషన్ అజయ్(Operation Ajay) కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇద్దరు నేపాల్(Nepal) పౌరులతో సహా 143 మంది ప్రత్యేక విమానంలో ఆదివారం భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. 'ఆపరేషన్ అజయ్' ఆరో విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం(New Delhi Airport)లో దిగింది. కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే(Faggan Singh Kulaste) విమానాశ్రయంలో ప్రయాణికులకు స్వాగతం పలికారని వెల్లడించారు. అంతకుముందు 18 మంది నేపాల్ పౌరులతో సహా 286 మంది భారతీయులతో ఐదవ విమానం మంగళవారం అర్థరాత్రి న్యూఢిల్లీకి చేరుకుంది.
అక్టోబరు 7న ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ ఉగ్రవాదులు(Hamas Terrorists) దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ నుండి భారతీయులు తిరిగి రావడానికి అక్టోబర్ 12న 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించారు. ఇప్పటి వరకు 1300 మందికి పైగా 'ఆపరేషన్ అజయ్' కింద భారతదేశాని(India)కి తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్‌లో మృతి చెందిన నలుగురు నేపాలీ విద్యార్థుల మృతదేహాలను ఖాట్మండుకు తరలించారు. హమాస్ దాడిలో నేపాల్‌కు చెందిన 10 మంది విద్యార్థులు(Students) మరణించారు. ఆరుగురి మృతదేహాలను గుర్తించాల్సివుంది.