బాబర్‌ ఆజాంను(Babar azam) అత్యుత్తమ ఆటగాడని అనడంలో ఎలాంటి సంకోచాలు ఉండవు.

బాబర్‌ ఆజాంను(Babar azam) అత్యుత్తమ ఆటగాడని అనడంలో ఎలాంటి సంకోచాలు ఉండవు. ఎందుకంటే అతడి ఆట తీరు అంత గొప్పగా ఉంటుంది కాబట్టి. తనకున్న ప్రతిభా పాటవాలతోనే పాకిస్తాన్‌ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వచ్చాడు. షార్ట్ టైమ్‌లోనే టీమ్‌లో కీలకమైన ఆటగాడయ్యాడు. విరాట్‌ కోహ్లీతో(Virat Kohli) పోల్చి చూస్తే స్థాయికి చేరుకున్నాడు. అయితే బాబర్‌ మాత్రం తాను కోహ్లీ అంతటి వాడిని కానని, ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదని వినమ్రంగా చెబుతుంటాడు. టన్నుల కొద్దీ పరుగులు సాధించిన బాబర్‌కు జట్టు సారథ్య బాధ్యతలు లభించాయి. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ను నడిపించాడు. సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్‌ అతడి కెరీర్‌లో మచ్చలా మిగిలిపోయింది. ఈ మెగా టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ పేవలమైన ప్రదర్శనను కనబర్చింది. జట్టును నడిపించడంలో బాబర్‌ ఆజాం పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన బాబర్‌ అచిరకాలంలోనే అత్యత్తమ ఆటగాడిగా ఎదిగాడు.

వన్డేలలో అత్యధిక వేగంగా అయిదు వేల పరుగులు, అంతర్జాతీయ టీ-20లలో వేగంగా మూడు వేల పరుగులు సాధించిన రికార్డు బాబర్‌ పేరిటనే ఉంది. ఇప్పటివరకూ 117 వన్డేల్లో 56.72 సగటుతో 5729 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలున్నాయి. ఇక 49 టెస్టుల్లో 3772 పరుగులు, 104 టీ20ల్లో 3485 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌-5లో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు బాబర్‌ ఆజాం కావడం గమనార్హం. రెండేళ్ల పాటు వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగాడు. ఇటీవల శుభ్‌మన్‌ గిల్‌ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. 2019లో సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్థానంలో వన్డే టీమ్‌కు కెప్టెన్‌ అయ్యాడు. 2021లో టెస్ట్ టీమ్‌ సారథ్యం కూడా ఇతినికి దక్కింది. బాబర్‌ సారథ్యంలో పాక్‌ జట్టు 20 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో పదింట విజయం సాధించింది. ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయింది. నాలుగు మ్యాచులు డ్రాగా ముగిశాయి. 43 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే అందులో 26 మ్యాచ్‌లలో పాక్‌ గెలిచింది. 16 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక టీ-20ల విషయానికి వస్తే 71 మ్యాచ్‌లలో 42 విజయాలు లభించాయి. 23 మ్యాచ్‌లలో పాక్‌ ఓడిపోయింది. ఆరు మ్యాచ్‌లలో ఫలితం దక్కలేదు. టీ-20లో సక్సెస్‌ఫుట్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో జరిగిన టీ-2- ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. 2021లో సెమీస్‌ వరకు వెళ్లింది. ఆసియా కప్‌లో విజయం సాధించింది. వన్డేలలో పాకిస్తాన్‌ నంబర్‌వన్‌ ర్యాంకును అందుకుంది. బాబర్‌ ఆజాం కెప్టెన్సీలోనే పాకిస్తాన్‌ మొదటిసారి ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించింది.

ఈ ప్రపంచకప్‌ మాత్రం బాబర్‌కు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. జట్టును నడిపించడంలో ఘోరంగా విఫలం చెందాడు. ఒత్తిడి కారణమో మరోటో తెలియదు కానీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో విఫలం చెందాడు. బౌలింగ్‌ మార్పు చేతకాలేదు. ఫిల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌ కూడా దరిద్రంగా ఉండింది. సమర్థమైన వ్యూహాలు అమలు చేయలేకపోయాడు. ఉత్తి పుణ్యానికే సహచర ఆటగాళ్లపై అరిచాడు. కేకలు పెట్టాడు. పోనీ తను రాణించడా అంటే అదీ లేదు. తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 320 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ గెలిచింది నాలుగే! అయిదింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది. దాంతో బాబర్‌పై విమర్శల దాడి మొదలయ్యింది. పదవి నుంచి తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేయసాగారు. క్రికెట్ బోర్డు బాబర్‌కు సపోర్ట్‌ ఇవ్వలేదు. పైగా ప్రపంచకప్‌ వైఫల్యం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పొమ్మనలేక పొగపెట్టింది. ఇక గత్యంతరం లేక బాబర్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆటగాడిగా మాత్రం టీమ్‌లో ఉంటానని చెప్పాడు.

Eha Tv

Eha Tv

Next Story