King Shivaji Tiger Claw : 350 ఏళ్ల తర్వాత భారత్‌కు శివాజీ ఆయుధం!
350 ఏళ్ల తర్వాత మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీమహారాజ్(Shivaji maharaj) వాడిన రహస్య వెపన్ 'వాఘ్ నఖ్'(Vagh Nakh) భారత్‌కు చెరింది
350 ఏళ్ల తర్వాత మరాఠా మహారాజ్ ఛత్రపతి శివాజీమహారాజ్(Shivaji maharaj) వాడిన రహస్య వెపన్ 'వాఘ్ నఖ్'(Vagh Nakh) భారత్‌కు చెరింది. అత్యంత భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ కవర్‌లో ఈ ఆయుధాన్ని మహారాష్ట్రకు తరలించారు. సతారాలో ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీనిని ఉంచారు. ఈ అరుదైన ఘట్టానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే(Eknath shinde), డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నాయకులు వచ్చారు. ఈ మ్యూజియంలో ఏడు నెలల పాటు 'వాఘ్ నఖ్' ఆయుధాన్ని ప్రదర్శిస్తారు. ఇన్నేళ్లు అల్బర్ట్ మ్యూజియంలో ఈ ఆయుధం ఉంది. దీనిని ప్రజలకు చూపించాలని నిర్ణయించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా మూడేళ్ల పాటు మ్యూజియంలో ప్రదర్శించేందుకు ఆ దేశంతో ఒప్పందం చేసుకున్నారు.
1649లో బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. బీజాపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా తన దగ్గర దాచుకున్న 'వాఘ్ నఖ్' ఆయుధాన్ని ఉపయోగించి అతన్ని మట్టుపెట్టారు. ప్రతాప్‌గఢ్ కోటలో ఈ ఘటన జరిగంది. ఇది ప్రస్తుతంగా సతారాలో ఉన్నందున, ఈ ఆయుధాన్ని రాష్ట్రప్రభుత్వం ఇక్కడికి తరలించింది.
అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. షిండే వర్గం శివసేన, బీజేపీ కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. దీంతో శివాజీ మహారాజ్ వాడిన రహస్య ఆయుధాన్ని తీసుకొచ్చామన్న సెంటిమెంట్‌తో మరోసారి ఎన్నికల్లో గెలవాలని షిండే కూటమి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాల్‌థాక్రే వారసులమని షిండే వర్గం చెప్పుకోగా, ఈసారి ఏకంగా శివాజీరాజ్ ఉపయోగించిన రహస్య ఆయుధం తెచ్చి మరోసారి తామే బాల్‌థాక్రే వారసులుగా నిలిచామని షిండే వర్గం క్లయిమ్ చేసుకుంటోంది.