బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి పదవికి షేక్‌ హసీనా(PM Sheikh Hasina)(76) రాజీనామా(Resign) చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది.

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి పదవికి షేక్‌ హసీనా(PM Sheikh Hasina)(76) రాజీనామా(Resign) చేశారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. లా అండ్‌ ఆర్డర్‌(Law And Order)ను ఆర్మీ(Army)పర్యవేక్షిస్తుందని, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ప్రకటించినట్లు అక్కడి మీడియా సంస్థల ద్వారా కథనాలు ఇస్తున్నాయి. జాతిని ఉద్దేశించి ప్రసంగించాలని, అందులోనే రాజీనామా ప్రకటన చేయాలని హసీనా అనుకున్నారు. కానీ సైన్యం సూచనతో ఆమె కనీసం రాజీనామా రికార్డింగ్‌ కూఆ చేయకుండా గానభనవ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆమె హెలికాఫ్టర్‌(Helicrofter) ద్వారా ఇండియాకు(India)వచ్చారని, ఇక్కడి నుంచి లండన్‌(London)కు వెళ్లినట్టు మీడియాచెబుతోంది. హసీనా ఢాకా విడిచిపెట్టి వెళ్లిపోయారని తెలియగానే వేలాది మంది నిరసనకారులు ప్రధానమంత్రి నివాసాన్నిచుట్టుముట్టారు. విధ్వంసకాండకు దిగారు. సైన్యం రావడంతో వారంతా వెనక్కి తగ్గారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌(Bangladesh) పాలన సైన్యం చేతుల్లో ఉంది,. పరిస్థితులు అదుపుల్లోకి వచ్చే వరకు బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. గత పదిహేనేళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్‌ హసీనా కొనసాగుతున్నారు. 1996 జూన్‌లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తంగా 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్‌ నేతగానే కాకుండా ప్రపంచంలోనూ తొలి మహిళా నేతగా ఘనత సాధించారు.

ehatv

ehatv

Next Story