Shamima Begum : ఐసిస్ పెళ్లికూతురు పౌరసత్వం రద్దును సమర్థించిన అప్పీల్ కోర్టు
ఐసిస్(ISIS) పెళ్లికూతురు షమీమా బేగం(Shamima Begum) జీవితాంతం సిరియాలోనే(Syria) ఉండాల్సి వచ్చేట్టుగా ఉంది. తన బ్రిటన్ పౌరసత్వాన్ని(Britain citizenship) తిరిగి సంపాదించుకోవడానికి చేస్తున్న న్యాయపోరాటంలో ఆమెకు నిరాశే మిగులుతోంది. పౌరసత్వం విషయంలో బ్రిటన్‌లోని స్పెషల్ ఇమిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ (SIAC) గతంలో ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది. షమీమా బేగంను ఇతరులు ప్రభావితం చేస్తే చేసి ఉండవచ్చు కానీ ఆమె అన్ని తెలిసే సిరియాకు వెళ్లి ఉగ్రసంస్థలో చేరిందని కమిషన్ తెలిపింది.
ఐసిస్(ISIS) పెళ్లికూతురు షమీమా బేగం(Shamima Begum) జీవితాంతం సిరియాలోనే(Syria) ఉండాల్సి వచ్చేట్టుగా ఉంది. తన బ్రిటన్ పౌరసత్వాన్ని(Britain citizenship) తిరిగి సంపాదించుకోవడానికి చేస్తున్న న్యాయపోరాటంలో ఆమెకు నిరాశే మిగులుతోంది. పౌరసత్వం విషయంలో బ్రిటన్‌లోని స్పెషల్ ఇమిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ (SIAC) గతంలో ఇచ్చిన తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది. షమీమా బేగంను ఇతరులు ప్రభావితం చేస్తే చేసి ఉండవచ్చు కానీ ఆమె అన్ని తెలిసే సిరియాకు వెళ్లి ఉగ్రసంస్థలో చేరిందని కమిషన్ తెలిపింది. 24 ఏళ్ల షమీమా ప్రస్తుతం ఉత్తర సిరియాలోని శరణార్థి శిబిరంలో నివసిస్తున్నారు. 15 ఏళ్లు ఉన్నప్పుడు షమీమా బేగం సిరియాకు వెళ్లింది. బంగ్లాదేశ్ మూలాలు ఉన్న ఆమె 2015 ఫిబ్రవరిలో ఐసిస్‌లో చేరడానికి సిరియాకు వెళ్లింది. తూర్పు లండన్‌లోని బెథ్నల్ గ్రీన్ స్కూల్‌లో చదువుతుండేది. ఆమెతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులను కూడా సిరియాకు వెళ్లారు. అక్కడ నెదర్లాండ్స్‌కు చెందిన ఐసిస్ ఉగ్రవాది యగో రీడ్జిక్‌ను పెళ్లి చేసుకుంది షమీమా. అందుకే ఆమెను ఐసిస్ పెళ్లికూతురుగా వ్యవహరించేవారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారు. 2019 ఫిబ్రవరిలో సిరియా శరణార్థుల శిబిరంలో షమీమా కనిపించడంతో.. బ్రిటన్ హోంశాఖ ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే.. తిరిగి రావడానికి ఆమెకు అవకాశం కల్పించకూడదంటూ 2021లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జాతీయ భద్రత ముందు ఏదీ ప్రధానం కాదని స్పష్టం చేసింది. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం మంచిపనేనని చెప్పింది. 2022లో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. దీంతో షమీమా బేగం ఎస్‌ఐఏసీని ఆశ్రయించింది. తాను మానవ అక్రమ రవాణా బాధితురాలిగా చెప్పుకున్నా కమిషన్ లైట్ తీసుకుంది. పౌరసత్వం రద్దుకు హోంశాఖ ఈ విషయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేయగా మరోసారి ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.