అమెరికాకు(America) చెందిన 73 ఏళ్ల థామస్‌ యూజీన్‌ క్రీజ్‌(Thomas Eugene Crease) ఓ సీరియల్ కిల్లర్‌(Serial killer). మూడు రాష్ట్రాలలో అయిదు హత్యలు చేసిన ఇతడు సుమారు 50 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. ఇతడు అనేక కేసులలో అనుమానితుడిగా ఉన్నాడు. 1981లో తోడి ఖైదీపై దాడికి దిగి అతడి ప్రాణాలు తీశాడు. ఈ కేసులో థామస్‌కు మరణశిక్ష పడింది. అప్పట్నుంచి మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు.

అమెరికాకు(America) చెందిన 73 ఏళ్ల థామస్‌ యూజీన్‌ క్రీజ్‌(Thomas Eugene Crease) ఓ సీరియల్ కిల్లర్‌(Serial killer). మూడు రాష్ట్రాలలో అయిదు హత్యలు చేసిన ఇతడు సుమారు 50 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. ఇతడు అనేక కేసులలో అనుమానితుడిగా ఉన్నాడు. 1981లో తోడి ఖైదీపై దాడికి దిగి అతడి ప్రాణాలు తీశాడు. ఈ కేసులో థామస్‌కు మరణశిక్ష పడింది. అప్పట్నుంచి మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. కాకపోతే శిక్ష అమలు అవ్వడం లేదు. తాజాగా అతడికి మరణశిక్షను అమలు చేయడానికి రెడీ అయ్యారు. ఇడాహోని మరణశిక్ష ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి శిక్ష అమలు చేయడం కోసం ముగ్గురు వైద్యులు సిద్ధమయ్యారు. అతడి చేతులు, కాళ్లు, భుజాలతో పాటు ఇతర ప్రాంతాల్లో రక్తనాళం కోసం(Veins) వెతికారు. ఇలా గంట సేపు ఎనిమిది సార్లు వెతికారు. రక్తనాళం దొరకక్కపోవడంతో మరణశిక్ష అమలును విరమించుకున్నారు. థామస్‌ యూజీన్‌ క్రీజ్‌ డెత్‌ వారెంట్‌ గడువు ముగిసిపోతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే రాజ్యాంగబద్ధమైన విధానంలో మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు ఫెయిలయ్యారంటూ దోషి తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించాడు. ఈ డెత్‌ వారెంట్‌ ముగిసేలోపు మరోసారి మరణశిక్ష అమలుకు ప్రయత్నించవద్దంటూ కోర్టు ఆదేశించింది. దీంతో శిక్ష అమలు చేయాలంటే అధికారులు కొత్తగా మరో వారెంట్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అతడి ప్రాణాన్ని రక్తనాళం బతికించింది.

Updated On 29 Feb 2024 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story