తెలుగోళ్లకు మరీ ముఖ్యంగా ఆంధ్రమూలాలు ఉన్నవారికి కులజాడ్యం(caste feeling) రవ్వంత ఎక్కువగా ఉంటుంది.

తెలుగోళ్లకు మరీ ముఖ్యంగా ఆంధ్రమూలాలు ఉన్నవారికి కులజాడ్యం(caste feeling) రవ్వంత ఎక్కువగా ఉంటుంది. తెలుగువారు పుసుక్కన ఏదైనా ఘనత సాధించడం తరువాయి.. వారి కులాన్వేషణ మొదలవుతుంటుంది. నిద్రాహారాలు మానేసి ఆ పనిలో పడతారు. చూశారా ? మా కులపోల్ల గొప్ప అంటూ సోషల్‌ మీడియాలో(Social media) టన్నుల కొద్దీ రాతలు రాస్తారు. తాజాగా అమెరికా(America) ఉపాధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ(Republic party) అభ్యర్థి జేమ్స్‌ డేవిడ్‌ వాన్స్‌(James David Vance) భార్య ఉషా చిలుకూరి(Usha Chilukuri) తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అని తెలియగానే శోధనలు మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడంతో కులాసక్తి ఇంకా ఎక్కువయ్యింది. ఆమె పూర్వీకులది కృష్ణా జిల్లా అని తెలియడం ఆలస్యం సామాజికవర్గం ఏమై ఉంటుంది చెప్మా అంటూ డిస్కషన్స్‌ స్టార్టయ్యాయి. కులమేమిటో తెలుసుకునే వరకు తిండితిప్పలు మానేసిన వారు కూడా ఉన్నారు. కులం తెలుసుకోవడానికి వారికి వచ్చిన ఇబ్బందేమిటంటే చిలుకూరి అనే ఇంటి పేరు రెండు మూడు సామాజికవర్గాల వారికి ఉంది. అందుకే ఆమె మా అమ్మాయి అని కొందరు, కాదు కాదు ఆమె మా కులం పిల్లేనని మరికొందరు వాదులాడుకోవడం మొదలుపెట్టారు.

చిలుకూరి ఉష తండ్రి పేరు క్రిష్‌(Krish). తల్లి పేరు లక్ష్మి(Lakshmi). వీరి పూర్వీకులు కృష్ణా జిల్లాకు చెందిన వారు. రెండు తరాలకు ముందు వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. అయిదారు దశాబ్దాల ముందు ఉషా నాయినమ్మ, తాతయ్యలు కృష్ణా జిల్లా(Krishna DIstrict) పామర్రు నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మి కూడా హైదరాబాద్‌కు(Hyderabad) వచ్చేశారు. ఇక్కడ్నుంచి ఈ దంపతులు అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో(California) స్థిరపడ్డారు. క్రిష్‌ ఫిజిషియన్‌గా పని చేసి రిటైరయ్యారు. ఇన్ని చెప్పిన తర్వాత వారి సామాజికవర్గం ఏమిటో చెప్పకుంటే చాలా మంది హర్టవుతారు. అందరూ అనుకుంటున్నట్టు ఉషా చిలుకూరు కమ్మ(Kamma) సామాజికవర్గానికి చెందిన వారు కాదట! ఆమెది బ్రాహ్మణ సామాజికవర్గమట!

మన వాళ్లు అమెరికాకే కాదు, ఈ విశాల విశ్వంలో ఆ మూలనున్న గ్రహానికి వెళ్లినా కులాన్ని మాత్రం వదులుకోరు. అక్కడికి వెళ్లిన వారు వదిలేసుకున్నా ..ఇక్కడున్న మనవాళ్లు మాత్రం చస్తే వదలరు! కులమేమిటో తెలుసుకున్నాకే కడుపు నిండా భోంచేస్తారు!

Eha Tv

Eha Tv

Next Story